దేశంలో 18 రాష్ట్రాల్లో  ఈనెల 21న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  నిర్ణయించింది. మొత్తం 64 అసెంబ్లీ స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అంతేకాకుండా బీహార్ లోని సమస్థి పూర్ లో ఓ పార్లమెంటు స్థానానికి కూడా ఎన్నిక జరుగనుంది. అయితే ఎన్నికలను  ఈ నెల 21న నిర్వహించి ఫలితాలను ఈ నెల 24న వెల్లడించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడగా ... 15 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి.  మిగతా రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు  కోర్టు స్టే విధించింది. అయితే కర్ణాటకలో ఉప  ఈ ఉప  ఎన్నికలు...  హర్యానా మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగే  ఎన్నికల లాంటివే...  ఎందుకంటే ఈ 15 సీట్ల భవితవ్యముమే... కర్ణాటక ప్రభుత్వాన్ని నిర్ణయించనుంది . ఒకవేళ కాంగ్రెస్ జిడిఎస్ పొత్తుతో 15 సీట్లు గెలిస్తే బీజేపీ  ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. 

 

 

 

 

 కాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో  11 అసెంబ్లీ స్థానాల్లో  ఎక్కువగా ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత పార్లమెంటు సభ్యులుగా గెలిచినవారు ఉండగా... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక బిహార్లోని సమస్తిపూర్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. లోక్ జనశక్తి పార్టీ కి చెందిన సిట్టింగ్ ఎంపీ రామచంద్ర పస్వన్   మృతి చెందడం వల్ల... బీహార్లోని సమస్తిపూర్ లోక్ సభ  స్థానానికి ఉప  ఎలకలు జరగనున్నాయి. తెలంగాణలోనే కాకుండా అరుణాచల్ ప్రదేశ్,  చత్తీస్ ఘడ్,  మధ్యప్రదేశ్,  మేఘాలయ,  ఒడిశా మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 

 

 

 

 

 

 ఇక అస్సాంలో 4,  బీహార్ లో  5,  గుజరాత్ లో 4,  హిమాచల్ ప్రదేశ్ లో 2,  కేరళలో 5, పంజాబ్ లో 4,  రాజస్థానం 2,  తమిళనాడు 2 అసెంబ్లీ స్థానాలు సహా సిక్కింలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా  దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు  ఈ నెల 21న నిర్వహించబడుతుండగా  ఫలితాలు ఈనెల 24న విడుదల కానున్నాయి. కాక కొన్ని చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్ర అధికారాన్ని  నిర్ణయించనున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో  ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే 64 అసెంబ్లీ స్థానాల్లో  అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ఎవరికి వారు గెలుపుపై ధీమా తో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: