అక్టోబర్ 15 వ తేదీ నుంచి రైతు భరోసా పధకం అమలుకాబవుతున్నది.  ఈ పధకం కింద ప్రతి రైతుకు రూ. 12,500/- ఇవ్వబోతున్నారు.  ఈ డబ్బుతో రైతులు తమ పంటకు కావాల్సినవి కొనుగోలు చేసుకోవచ్చు.  వీటితో పాటు సబ్సిడీ తోవిత్తనాలు, పురుగు మందులు, ఎరువులను గ్రామ సచివాలయం ద్వారా అందించబోతున్నారు.  అంటే, రైతులకు రైతు భరోసా కింద ఇచ్చే రూ. 12,500/- లతో పాటుగా సబ్సిడీ కూడా అందుతుంది.  


ఇదిలా ఉంటె, రేపటి నుంచి రైతు భరోసా పధకం అమలు జరగబోతున్నది.  ఈ పధకం అమలు జరిగే సమయంలో రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు వైఎస్ జగన్.  రైతు భరోసా పధకం కింద ఇచ్చే రూ. 12,500/-లతో పాటుగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారు.  అంటే మొత్తంగా ఈ పధకం కింద రైతుకు రూ. 13,500/- అందబోతున్నాయి.  


ఇది అద్భుతమైన వరం అని చెప్పాలి.  పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల రైతులకు, అన్ని పార్టీల రైతులకు ఈ పధకం ద్వారా లబ్ది చేకూరబోతున్నది.  ఈ పధకం ద్వారా లబ్ది చేకూరితే.. అందరూ హ్యాపీగా ఉంటారు.  దేశానికీ రైతే వెన్నుముక అని మహాత్ముడు చెప్పిన విధానాన్ని జగన్ ఫాలో అవుతున్నాడు.  రైతులకు గౌరవం ఇవ్వాలని, రైతులను ప్రోత్సహించినపుడే రైతు మంచి పంటను పండిస్తారని, అప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారని వైకాపా భావించింది.  


ఒక్క రైతులకే కాకుండా, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో పధకాలను ప్రవేశపెట్టారు.  ప్రతి ఒక్కరికి ఈ పధకాలు ఉపయోగపడుతున్నాయి.  గ్రామ వలంటీర్ల పధకం ద్వారా దాదాపు 2.50 లక్షల మందికి ఉపాధి కల్పించారు.  వీరితో పాటుగా గ్రామ సచివాలయ ఉద్యోగాల ద్వారా మరో 1.50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.  ఇప్పుడు మరో పదివేల గ్రామ వలంటీర్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది.  ఇవే కాకుండా ప్రతి జనవరిలో మూడు వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను వెలువరించనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: