చేతిలో అధికారం ఉందని కిందవాళ్ళను ఎలాగైతే చూస్తారో.. డబ్బు ఉన్న వ్యక్తులు కూడా కింది వ్యక్తులను అలానే చూస్తుంటారు. అందరు అలా ఉంటారు అని కాదుగాని, అలా ఉండేందుకు ఛాన్స్ ఉన్నది అని మాత్రం చెప్పొచ్చు.  కొంతమంది పని చేయించుకొని ఆ ఎందుకు ఇవ్వాలి.. ఇంటి చుట్టూ తిప్పించుకుందాంలే అని అంటుంటారు.  ఇంటి చుట్టూ తిప్పించుకొని ఇవ్వకుంటే ఏమి కాదులే వాయిదా వేస్తుంటారు.  


తిరిగి తిరిగి వారే వెళ్ళిపోతారులే అని అనే వాళ్ళు చాలామంది ఉన్నారు.  అలాంటి వ్యక్తుల్లో ఒకరు అలీ రాజా.  ఈయన పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉంటాడు.  ఇతను తన ఇంట్లో సింహాన్ని పెంచుకుంటున్నాడు.  అక్కడ ఇలా వన్యప్రాణులను పెంచుకోవడం పెద్ద నేరం కాదు.  మనుషులకు సంబంధించిన మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటేనే దిక్కులేదు.  వన్యప్రాణుల హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే పట్టించుకునే వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి.  


అలీ రాజా అనే వ్యక్తి కొంతకాలం క్రితం మహ్మద్ రఫీక్ అనే ఎలక్రిష్టియన్ ను పిలిచి ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ చేయించుకున్నాడు.  డబ్బులు తరువాత ఇస్తానని చెప్పాడు.  పాపం రఫీక్ సరే అని చెప్పి వెళ్ళిపోయాడు.  రఫీక్ ఆ ఇంటి చుట్టూ చాలా రోజులు తిరిగాడు.  ఫలితం లేకుండా పోయింది.  చివరకు చికాకు వచ్చి.. డబ్బులు ఇస్తేనే వెళ్తాను అని మోడికేసి ఇంట్లోనే కూర్చున్నాడు.  


దీంతో కోపం వచ్చిన అలీ.. తాను పెంచుకుంటున్న సింహాన్ని రఫీక్ మీదకు వదిలాడు.  దీంతో అది అతని మీదకు దూకింది.  గాయపరిచింది.  లబోదిబో అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు.  ఆలీ సింహాన్ని తిరిగి బోనులో ఉంచి.. అతని హాస్పిటల్ ఖర్చులు... కూలి డబ్బు ఇస్తానని చెప్పారు.  ఆ తరువాత కూడా చెల్లించకపోవడంతో సెప్టెంబర్ 9 వ తేదీన ఎలక్రిష్టియన్ రఫీక్.. ఆలీపై కేసు పెట్టారు.  దీంతో పోలీసులు ఆలీని అరెస్ట్ చేశారు.  ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: