ప్రజా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ అన్ని  వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి... పొరుగు రాష్ట్రాల ప్రజలతో సైతం  జేజేలు  కొట్టించుకుంటున్నారు  జగన్ మోహన్ రెడ్డి. అయితే రైతులకు చేయూతనిచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రైతు భరోసా పథకం కింద రైతులందరికీ ప్రతిఏటా 12,500 రూపాయలు ఇచ్చి చేయూతనిచ్చేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జగన్ నిర్ణయం పట్ల ఏపీ రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం  రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా 12,500 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం... మరో వెయ్యి రూపాయలు పెంచి 13,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు 13,500 రూపాయలను ప్రతి ఏటా రైతుల  బ్యాంకు ఖాతాలో జమ కావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతులు,  రైతు ప్రతినిధుల సంఘాల డిమాండ్ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 

 

 

 

 

 కాగా మంగళవారం నుంచి రైతుబంధు పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కానుంది. నెల్లూరు జిల్లా కాకుటూరు లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే రైతు భరోసా పథకానికి గాను  5,510 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో ఈ రైతు భరోసా పథకం డబ్బును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. మే నెలలో  7500 రూపాయలు రబీలో 4000 రూపాయలు సంక్రాంతికి 2 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని  మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: