దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఏర్పడిన నిధుల కొరతను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో  ప్రభుత్వం వారు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ, అన్ని ప్రభుత్వ శాఖలకు, ఆర్థికశాఖ మార్గదర్శకాలు అయిన ఆసరా పింఛన్లు, ఉద్యోగుల జీతాలు, బియ్యం, విద్యుత్‌ సబ్సిడీలకే నెలవారీ చెల్లింపులు బడ్జెట్‌ అంచనాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సింది అని  సూచించారు.

కేంద్ర ప్రయోజిత పథకాలకు, అలాగే  కొత్త పథకాల ప్రతిపాదనలు పంపాకే నిధుల విడుదలపై  తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి శాఖకు ప్రతిపాదించిన బడ్జెట్‌ అంచనాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలంటూ, మిగిలే నిధులకే బీఆర్‌వోలు, ఎల్‌వోసీలను అనుమతించాలని కూడా ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరిట అన్ని ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలకూ అంటే కొత్త పథకాల ప్రతిపాదనలు పంపాకే నిధుల విడుదలపై నిర్ణయం. నెలవారీ చెల్లింపుల విషయంలోనూ కొన్ని పరిమితులు ఇక తప్పదని, నాలుగు అంశాలకు మాత్రమే నెలవారీ చెల్లింపులు చేస్తామని, మిగిలిన విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందనే సంకేతాలను ఉత్తర్వుల్లో ఇచ్చారు అని తెలిపారు. ఆసరా పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు, బియ్యం, విద్యుత్‌ సబ్సిడీలకు మాత్రమే బడ్జెట్‌ విడుదల అని  ఉత్తర్వులు జారీ చేస్తామని, మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఖర్చులను త్రైమాసికానికి ఓసారి మాత్రమే విడుదల చేస్తామని తెలిపారు.


దీంతో ఆ ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాలు  కూడా మూడు నెలలకోసారి మాత్రమే వస్తాయని తెలుస్తోంది. వీఆర్‌ఏలకు  మాత్రం ఇచ్చే గౌరవ వేతనాలను మాత్రం,ట్రెజరీ ఆంక్షలకు  సంబంధం లేకుండా నెలనెలా ఇవ్వాలని ఆర్థికశాఖ తాజా ఉత్తర్వుల్లో వెల్లడించిందని  పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: