తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. సమ్మె మొదలై పది రోజుల గడుస్తునప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై  పరిష్కారం చూప లేదు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం చూపకపోగా... సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత మంది తమ ఆత్మ బలిదానాలతో  అయిన ఆర్టీసీకి సరైన న్యాయం జరుగుతుందని ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇప్పటికే ఓ కండక్టర్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలర్పించారు. 

 

 

 

 

 

 ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపి... ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆర్టీసీ కార్మికుల తరఫున పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉదృతం  అవుతుంది. అయితే తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆర్టీసీ సమ్మెకు తమ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనకు దిగారు విద్యార్థులు. 

 

 

 

 

 రోజు రోజుకి సమ్మెకు మద్దతు పెరుగుతూ ఉదృతం అవుతున్న వేళ... ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు పై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. తాజాగా హెచ్సియూ డిపోలో  కండక్టర్ గా  పని చేసే సందీప్ బ్లేడ్ తో  కోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయనను హుటాహుటిన కొండాపూర్ లోని  ఆస్పత్రికి తరలించారు. కాగా  కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ... కొట్లాడి కార్మికులకు న్యాయం సాధించుకుందామని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కాగా  ఈ నెల 19న తెలంగాణ బంద్ నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: