మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక మీదట బీజేపీకి ఓటు వేస్తే, పాకిస్తాన్‌ పైన  అణుబాంబు వేసినట్టే అని  కేశవ్‌ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. థానేలోని మిరా భయేందర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నరేంద్ర మెహతా తరపున ప్రచారం చేసిన  కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . ప్రజలు ఈవీఎంల్లో కమలం గుర్తును ఎంచుకుంటే పాకిస్తాన్‌పై అణుబాంబును జారవిడిచినట్టే  అని అయన అన్నారు. 


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన  అత్యంత విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు కేవలం బీజేపీ వల్లే సాధ్యమైందని, ఇది కమలం గుర్తు అభివృద్ధికి సంకేతమని చెప్పారు. లక్ష్మీ దేవత సైకిల్‌ లేదా వాచ్‌పై కూర్చోదని.... కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ మరియు ఎన్‌సిపి యొక్క పోల్ చిహ్నాలకు సూచన చేస్తూ....ఆమె కేవలం కమలం పువ్వుపై మాత్రమే కూర్చుంటారని.... ఇది అభివృద్ధికి చిహ్నం అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరగనున్న సంగతి అందరికి  తెలిసిందే. ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత దేశంలో జరిగే మొదటి ఎన్నికలు ఇవే అని ,అందువల్ల  ఈ ఎన్నికలకు అంత  ప్రాముఖ్యత ఉంది అని తెలిపి.. ఈ ఎన్నికల ఫలితాలు  రాష్ట్ర ప్రజల భక్తిని తెలుపుతాయి అని ఆయన అన్నారు.కాబట్టి, ప్రతి  ఒక్కరు వాళ్ళ  ఓటు హక్కును వినియోగించుకోవాలని  అని ఆయన ప్రజలకు సూచించారు.

మీరు వేసే ప్రతి  ఓటు నరేంద్ర మెహతాకు మాత్రమే కాదు, అటు  ప్రధాని మోడీ మరియు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నాయకత్వానికి  కూడా ఉంటుంది అని మౌర్య సభకు చెప్పారు.అక్టోబర్‌ 24న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: