ఎట్టకేలకు సినీ ఇండస్ట్రీ జగన్ ని కలవక తప్పలేదు.. చిరంజీవికి సైతం ఈ పరిస్థితి రావడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో తాను సమావేశం కావాలని సమయం కేటాయించాలని కోరిన వెంటనే ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి లంచ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ రోజు మధ్నాహ్నం ఒంటి గంటకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ విందు భేటీ జరగనుంది.

సచివాలయం అధికారిక షెడ్యూల్ పూర్తి చేసుకొని 12:40 గంటలకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ నుండి తన నివాసానికి బయల్దేరనున్నారు. మధ్నాహ్నం 1.10 గంటలకు చిరంజీవి ఆయన తనయుడు రాంచరణ్ ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. జగన్ తో కలిసి లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు.
మొత్తం కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యత ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి కన్నబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన సమయం నుండి భేటీ పూర్తయ్యే వరకూ చోటు చేసుకొనే చర్చలు పరిణామాల పైన రాజకీయం గాను...,, సినీ ఇండస్ట్రీలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. సైరా సినిమా విడుదల తరువాత మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి సినిమాను చూడాల్సిందిగా చిరంజీవి ఆహ్వానించేందుకే వస్తున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సీఎంఓ లో అప్పాయింట్ మెంట్ కోరారు. ఆ వెంటనే జగన్ నుండి తన ఇంటికి లంచ్ కు రావాలని ఆహ్వానం అందగా చిరంజీవి చాలా ఆనందంతో అంగీకరించారు. ఈ సమావేశంలో సినిమా నిర్మాత చరణ్ కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశం కోసం ముఖ్యమంత్రి షెడ్యూల్ లో దాదాపు గంటన్నార సమయం కేటాయించారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలను రాజకీయాలను మరిచి ఇప్పుడు ఇద్దరూ భిన్న హోదాల్లో సమావేశం కానుండటంతో అనేక అంచనాలు తెర మీదక వస్తున్నాయి. బాహుబలి స్థాయిలో సైరా ను నిలబెట్టుకునే యత్నమేనా ముఖ్యమంత్రి ని కలవడం అనేది తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: