1992  డిసెంబర్ 6 నుంచి అయోద్య లో రగడ మొదలైన సంగతి తెలిసిందే.  బాబ్రీ మజీద్ ఉన్న స్థానంలో రామ్ లల్లా పుట్టారని, అప్పట్లో ఆ స్థానంలో దేవాలయం ఉందని, దాన్ని పడేసి బాబ్రీ మజీద్ కట్టారని హిందువులు ఆరోపించారు.  ఆ తరువాత 1992, డిసెంబర్ 6 వ తేదీన బాబ్రీ మజీద్ ను కూల్చేవేశారు.  దాన్ని కూల్చివేసిన తరువాత అనేక వాదోపవాదనలు జరిగాయి.  


అలహాబాద్ కోర్టులో కేసు నడిచింది.  ఆ తరువాత సుప్రీం కోర్డులో కేసు నడుస్తోంది.  ఈ కేసు కోసం ఆగష్టు 6 వ తేదీ నుంచి అయోధ్య కేసులో ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసి వాదనలు వింటోంది.  గత 38 రోజులుగా డైలీ వాదనలు విన్నారు.  బాబ్రీ మజీద్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినేశారు.  అక్టోబర్ 16 వ తేదీతో వాదనలు ముగియనున్నాయి.  ఆ తరువాత ఒక్కరోజు కూడా ఈ వాదనలు వినేందుకు సిద్ధంగా లేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.  


అక్టోబర్ 16 వ తేదీన కేసును రిజర్వ్ చేయనున్నారు.  నవంబర్ 17వ తేదీన ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడబోతున్నది.  సరిగ్గా నెల రోజుల సమయం ఉండటంతో.. దీనిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.  ఎవరికి తీర్పు అనుకూలంగా రానున్నది అన్నది ఉత్కంఠత నెలకొన్నది.  ముస్లిం లకు అనుకూలంగా వస్తుందా లేదంటే.. హిందువులకు అనుకూలంగా ఇస్తారా అన్నది తెలియాలి.  


హిందువులకు, ముస్లింలకు కాకుండా ఆ భూమిని వివాదాస్పాద భూమిగా పక్కన పెడతారా అన్నది తెలియాలి.  మరో నెల రోజులలో తీర్పు రాబోతున్న తరుణంలో అయోధ్యలో ఎలాంటి ఉద్రిక్తకరమైన నెలకొనకుండా ఉండేందుకు అక్కడ 144 వ సెక్షన్ ను విధించారు.  ఈ నెల రోజులపాటు అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎవరికీ అనుకూలంగా వచ్చినా దాని తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: