ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తామని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గతంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా  గుర్తిస్తామని హామీకి కట్టుబడి ఉండాలన్నారు. టీఆరెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు అంటే మాకు గౌరవం ఉందన్నారు. ఉద్యమం సమయంలో ఎంతో కృషి చేసారని చెప్పారు. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే మంచిదేనన్నారు. కేకే చర్చలకు ఆహ్వానిస్తే మేము చర్చలకు రావడానికి సిద్దమని చెప్పారు.



అయితే  కొంత  మంది మంత్రులు కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎర్రబెల్లి దయాకరరావు ఏం మాట్లాడడో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ జెఎసి నాయకులు ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై మాకు నమ్మకం ఉందని చెప్పారు. కార్మిక సంఘాలు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాము రెచ్చగొట్టినట్టు నిరూపిస్తే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. ఇక, సమ్మె గురించి టీఎన్జీవోలకు చెప్పలేదనడంఅశ్వత్థామరెడ్డి సరికాదన్నారు.  కాకపోతే, తమకు ఉద్యోగ సంఘాల నేతలపై నమ్మకముందున్నారు.




మరోవైపు ఆర్టీసీ కార్మికులు, సంస్థ పరిరక్షణకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న ఎంపీ కే కేశవరావు స్వాగతించారు. ఇప్పటి వరకు  ఆర్టీసీ కార్మికులకు చాల చేసిందన్నారు. ముఖ్యంగా 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని కేకే చెప్పారు. కానీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తనను ఎంతగానో బాధించిందన్నారు. అయితే, ఆత్మహత్యలతో ఏ సమస్య పరిష్కారం కాదని హితవు పలికారు. ఇదిలా ఉండగా  మద్యాహ్నం 1గంటలకు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించామన్నారు. కార్మికుల సమ్మె, ఆత్మహత్య లపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని ఆర్టీసీ జేఏసీ నేత తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: