మెగాస్టార్ చిరంజీవి సైరా సూపర్ హిట్ అయ్యింది.  టాలీవుడ్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది.  గత 12 రోజులుగా సినిమా వసూళ్లు సాధించింది.  తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలో మంచి వసూళ్లు వస్తున్నాయి.  తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుని కథతో తెరకెక్కింది. మెగాస్టార్ తన మెస్మరైజ్ నటనతో ఆకట్టుకున్నాడు.  మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్, యాక్షన్, అన్నింటిని అద్భుతంగా చేశారు.  ఇప్పటికే ఈ సినిమా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  


సినిమా హిట్ తరువాత అనేకమంది హీరోలు, దర్శకులు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు అనేక మంది సైరాను పొగుడుతూ.. ట్వీట్ చేశారు. హంగామా చేశారు. ట్రీట్ చేసుకున్నారు.  ఇదిలా ఉంటె, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అమరావతి వెళ్లి జగన్ ను కెలికారు.  ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు.  సైరా సినిమాను చూడాలని జగన్ ను కోరారు.  దానికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారు.  


కాగా,మెగాస్టార్ ఈనెల 16 వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు.  మెగాస్టార్ తో పాటుగా గంట కూడా వెళ్తున్నారని సమాచారం.  గంట శ్రీనివాస్ మెగాస్టార్ తో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతిని కలిసి సైరా సినిమాను చూడమని అడిగే అవకాశం ఉన్నది.  దీంతో పాటు రాష్ట్రంలోని రాజకీయాల గురించి కూడా వెంకయ్యనాయుడుతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు.  ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి మోడీని కూడా కలుస్తారని సమాచారం.  


మోడీ ప్రధాని అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఆయన్ను కలవలేదు.  పవన్ కళ్యాణ్ 2014లో బీజేపీ తరపున ప్రచారం చేసిన సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  అటు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు మోడీని సైరా సినిమా విషయంపై కలవబోతున్నారు.  అంతేకాదు, కూడా గంట శ్రీనివాస్ ఉంటున్నారు కాబట్టి రాజకీయంగా ప్రాధాన్యత ఉండే ఆ ఉండే అవకాశం ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: