ప్రపంచంలో కెల్లా ధనిక క్రికెట్ బోర్డయిన బీసీసీఐ పై తమ పట్టు చిక్కించుకోవాలనే ప్రయత్నంలో జగన్ క్యాంప్ విఫలమైంది. జగన్ కీ బీసీసీఐ కి సంబంధం ఏమిటనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. అయితే జగన్ వ్యాపార భాగస్వామి అయిన శ్రీనివాసన్ బీసీసీఐ ప్రెసిడెంట్ గా మాజీ క్రికెటర్ అయిన బ్రిజేష్ ని చేయాలని విజయసాయిరెడ్డితో లాబీయింగ్ నడిపి ఎలాగైనా ఆ పదవిని బ్రిజేష్ కి రావాలని చూశాడూ. అయితే జగన్ వ్యాపార భాగస్వామి కావడంతో జగన్ కూడా ఈ లాబీయింగ్ కి హెల్ప్ చేశాడు.


అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆ పదవి సౌరవ్ గంగూలీని వరించింది. ఈ పదవి గంగూలీకి రావడానికి గల ముఖ్య కారణం. అతడు బీజేపీకి అనుకూలంగా ఉండటమే అనే టాక్ వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా అమిత్ షా టీం చక్ర్ం తిప్పిందని అంటున్నారు. అయితే బీసిసీఐ ని తమ చేతుల్లోకి లాక్కోవాలనుకున్న బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న సౌరవ్ గంగూలీని ప్రెసిడెంట్ చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక్కడ జగన్ ఎత్తులు ఏమీ పని చేయలేవు.


కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్ గంగులితో పాటు కార్యదర్శిగా అమిత్ షా కొడుకు జయ షా నియమితమవుతున్నాడట. అంతే కాదు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి  అనురాగ్ ఠాకూర్ సొదరుడు అనురాగ్ ధుమాల్ కొత్త కోశాధికారిగా రాబోతున్నాడు. దీంతో బీసిసిఐ మొత్తం బీజేపీ చేతుల్లోకి వెళ్ళినట్టే.


కనీసం ఇతర పదవులైన తమకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలనుకుని  విజయ సాయిరెడ్డితో లాబీయింగ్ నడిపిన శ్రీనివాసన్ కి అమిత్ షా వ్యూహంతో పెద్ద దెబ్బ పడినట్లయింది. తన వ్యాపార భాగస్వామికి సాయం చేద్దామనుకున్న జగన్ ఎత్తులు వేసినప్పటికీ అవి అమిత్ షా ముందు ఏమీ పని చేయలేయలేవని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: