ఇటీవల తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తాత్కాలిక నియామకాలకు  వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సరైన ధ్రువీకరణ పత్రాలతో స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని నోటిఫికేషన్‌లో తెలపడం జరిగింది. తాత్కాలిక ప్రాతిపదికన దినసరి వేతనంతో వీరిని విధుల్లోకి తీసుకుంటారు. డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000 అందచేస్తునట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అలాగే మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్ మెకానిక్‌, క్లరికల్ సిబ్బందికి  అర్హత వాళ్ళకి రూ.1000 వేతనం అందించనున్నారు. 


ఇక ఐటీ ట్రైనర్ నిపుణులకు మాత్రం  రోజుకు రూ.1500  వేతనం అందించనున్నారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక ప్రాతిపదికగా ప్రభుత్వం కార్మికుల నియామకం చేపట్టనుంది అని తెలియచేసిసారు.


ఇదిలా ఉంటే, ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో కార్మికవర్గాలు మరింత మండి పడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామని తెలియచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీకి మద్దతుగా నిలవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితోనే వ్యవహరిస్తుండటం చాలా  గమనార్హం. యూనియన్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని.. 50వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసినట్లు అని  ప్రభుత్వం తెలుపుతుంది.


ఇక అర్హత విషయానికి వస్తే పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. పూర్తి సమాచారం కోసం మీకు సమీపంలో ఉన్న డిపో మేనేజర్‌ను సంప్రదించవచ్చు అని తెలుపుతున్నారు. వివిధ పోస్టులకు వివిధ పారితోషికం వివరాలు చూద్దామా మరి .... డ్రైవర్ రూ.1500 , డ్రైవర్ (ఓల్వో/ఏసీ/ మల్టీ యాక్సిల్స్) రూ.2000 , కండక్టర్ రూ.1000 , రిటైర్డ్ ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్స్ రూ.1500 , మెకానిక్ రూ.1000 , శ్రామిక్ రూ.1000 , ఎలక్ట్రీషియన్ రూ.1000 , టైర్ మెకానిక్ రూ.1000 , క్లరికల్ సిబ్బంది రూ.1000 , ఐటీ ట్రైనర్ రూ.1500  పారితోషికం ఇవ్వనట్లు నోటిఫికేషన్లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: