సమ్మె మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజలకు తిప్పలు మొదలయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె  మొదలుపెట్టడంతో... దసరా పండుగ ఊళ్లకు  వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే దసరా పండక్కి ఎలాగోలా ఇళ్లల్లోకి చేరుకున్నారు కానీ మళ్లీ హైదరాబాద్ కి రావడం ఎలా అని ఆలోచిస్తున్నారు ఊర్లల్లోకి  వెళ్ళిన వాళ్ళు. అయితే ఆర్టీసీ సమ్మె మొదలై పది రోజులు అవుతుంది. అయినప్పటికీ అటు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేయగా... ఇటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి ప్రసక్తిలేదని చెబుతుంది. దీంతో ప్రజలకు పాట్లు  తప్పడం లేదు.

 

 

 

 

 

 ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా... ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. అద్దె,  ప్రైవేటు బస్సులను తిప్పుతూ ప్రయాణికుల అవసరాలను తీరుస్తుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు ఆర్టీసీ బస్సులు స్థాయిలో ప్రయాణికుల అవసరాలను పూర్తిగా తీర్చలేక పోతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం తిప్పుతున్న బస్సులో కూడా కండక్టర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇంకొంతమంది తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సు డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు. 

 

 

 

 

 ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె ఎఫెక్టుతో విద్యాసంస్థలకు సెలవులు  పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే విద్యా సంస్థలకు దసరా సెలవులు పొడిగించిన నేపథ్యంలో... ఈ వ్యవహారంపై ఓ సామాన్యుడు సీఎం కార్యాలయానికి కాల్ చేసి నిలదీశాడు అని ఓ  ఆడియో టేప్ సోషల్ మీడియాలో హల్ చల్  చేసింది. అయితే కేసీఆర్ తీరుపై ఆ వ్యక్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ కార్యాలయం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైన్ కి  ఎవరో ఫోన్ చేసినట్లు తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికలు ఛానళ్లలో  తప్పుడు వార్తలు వస్తున్నాయని... సోషల్ మీడియాలో కూడా ఇదేవిధంగా దుష్ప్రచారం జరుగుతోందని సీఎం కార్యాలయం సిబ్బంది మాట్లాడినట్లు ఎవరో  వాయిస్ సృష్టించారని  తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీసు కమిషనర్ కు  ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: