నేను విన్నాను...నేను ఉన్నాను అంటూ హామీ ఇస్తూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...అద్భుతమైన పాలన చేస్తూ ముందుకెళుతున్నారు. తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రజల కష్టాలని తీరుస్తున్నారు. కేవలం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే అనేక హామీలు నెరవేర్చారు. అయితే ఈ హామీల అమలు పట్ల ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. అయితే ఈ నాలుగన్నర నెలల పాలన కాలంలో జగన్ అమలు చేసిన అద్భుతమైన హామీల్లో ఒకటి ఆశా, అంగన్ వాడీ వర్కర్లకు జీతాలు పెంపు.


గత టీడీపీ ప్రభుత్వం హయం వరకు రూ. 3వేలు ఉన్న ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలుకు పెంచారు. అటు అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంచగా, ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. అయితే జీతాల పెంపు పట్ల అటు ఆశా వర్కర్లు, ఇటు అంగన్ వాడీ టీచర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వేల కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా ఆశా వర్కర్ల ఇబ్బందులను గుర్తించిన వైఎస్‌ జగన్‌ తమ పార్టీ అధికారంలోకి రాగానే వారి వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు.


అలా ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ సీఎంగా ప్రమాణం చేసిన ఐదో రోజే వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి నెలా పది వేలు వస్తుండటంతో ఆశాలు..తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంబరపడుతున్నారు. అయితే అంగన్ వాడీ, ఆశా వర్కర్లతో పాటు జగన్..పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంచగా, గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంచారు.


ఈ విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆశా, అంగన్ వాడీ, పారిశుధ్య కార్మికులు, గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపారు. అయితే లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ జగన్ కు మద్ధతు తెలుపుతున్నారు. తమకు చేసిన సాయానికి జగన్ కు కృతజ్ఞతగా ఉంటామని అంటున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఆశా, అంగన్ వాడీల అండ జగన్ కు బాగానే దొరకనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: