గత టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, దుబారాలు నిదానంగా బయటపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ చేసిన అక్రమాలు చాలానే బయటపడ్డాయి. ఇటీవలే టీడీపీ చేసిన దుబారా ఖర్చులు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ ఎయిర్ పోర్టు వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు చేసిన దుబారా బయటపడింది. తాజాగా చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్ళి తిరిగొస్తుండగా, ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు బాగా హడావిడి చేశారు.


రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ఎయిర్ పోర్ట్ వి‌ఐ‌పి లాంజ్ లో అల్పాహారం తిన్నారు. అయితే కొందరు టీడీపీలో కూడా పర్మిషన్ లేకపోయిన చంద్రబాబుతో పాటే పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచి బిర్యానీలు తెచ్చుకుని లాగించేశారు. పైగా బిల్లు కూడా కట్టలేదు. దీంతో రెస్టారెంట్ ఓనర్ బిల్లుని, ఎయిర్ పోర్టు అధికారులని అడిగారు. వాళ్లెమో గతంలో చంద్రబాబు, లోకేష్ పెట్టిన బిల్లులే పెండింగ్ లో ఉన్నాయని, కాబట్టి ఆ బిల్లు తాము చెల్లించలేమని చేతులెత్తేశారు.


మామూలుగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బాబు బిల్లుని అధికారులు చెల్లించాలి, కానీ మిగతా నేతలు కూడా బాబు ఖాతాలో బిర్యానీలు తినేశారు. దీంతో అధికారులు బిల్లు చెల్లించలేమని చెప్పారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ లు ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు గట్టిగానే దుబారా చేసిన విషయం బయటపడింది. ఒక్క లోకేష్ స్నాక్స్ ఖర్చే లక్షల్లో ఉందని తెలుస్తోంది.


లోకేష్ బాబు చెకోడీలు, చాక్లెట్లలకే గట్టిగా ఖర్చు అయింది. 2017 నుంచి 2019 మార్చి వరకు చంద్రబాబు, లోకేష్‌బాబుల విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తినుబండారాల ఖర్చు సుమారు రూ.14 లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం విశాఖ ఎయిర్ పోర్టులోనే ఇంత ఖర్చు అయితే మిగతా చోట్ల ఐదు సంవత్సరాల్లో ఎంత దుబారా అయిందో ఊహాకే అందడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: