ఆయ‌న రాష్ట్ర కాబినెట్‌లో కీల‌క మంత్రి .. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు.. ప్ర‌తిప‌క్ష పా ర్టీని అధికార ప‌క్షంలో విలీనం చేసి, మంత్రి ప‌ద‌వి ద‌క్కించ‌కున్న నేత‌. ఏనాడు తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌కుండా, టీఆర్ ఎస్‌ను, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన నాయ‌కుడు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.. గతంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లి కిన ఆయ‌న నేడు ఆదే ఆర్టీసీ కార్మికుల స‌మ్మెను త‌ప్పుబ‌డుతున్నారు.


రాష్ట్రంలో ఆర్టీసీ స‌మ్మె ఉగ్ర‌రూపం దాల్చింది.  ప్ర‌తిప‌క్ష పార్టీల‌తోపాటు వివిధ సంఘాలు కూడా స‌మ్మెకు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని రోజురోజుకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రత‌రం అవుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుపున మంత్రి ఎర్ర‌బెల్లి ద యాక‌ర్‌రావు ఆర్టీసీ స‌మ్మెపై చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. అంతేగాక అధికార పార్ టీలోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారాయి.


గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద‌యాక‌ర్‌రావు 2014లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప లికారు. నాడు కార్మికుల‌కు అనుకూలంగా మాట్లాడారు. అదేస‌మ‌యంలో అధికార టీఆర్ ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. అంతేగాక కార్మికుల డిమాండ్లు న్యాయ‌మైన‌వ‌వి, వాటిని ప రిష్క‌రించాల‌ని కూడా ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు సీన్ మారింది. టీడీపీని వీడి ద‌యాక‌ర్‌రావు టీఆర్ ఎస్‌లో చేరారు. మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మెను ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నారు.


ఇటీవ‌ల ఆయ‌న స‌మ్మెపై చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో ఎర్ర‌బెల్లి అడ్డంగా బుక్క‌వుతున్నారు.  నాడు కార్మికుల‌కు మద్ద‌తుగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు, ప్ర‌స్తుతం అధికార పార్టీకి వంత‌పాడుతూ చేస్తున్న కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మంత్రి ప‌రువును బ‌జారుకీ డుస్తున్నాయి. ర‌క‌ర‌కాల కా మెంట్ల‌తో నెటిజ‌న్లు ఎర్ర‌బెల్లిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆట ఆడుకుంటున్నారు.


ఇంత‌లోనే ఎర్ర‌బెల్లి వైఖ‌రిలో అంత మార్పు వ‌చ్చిందా అని నెటిజ‌న్లు అవాక్క‌వు తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక ర‌కంగా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మ‌రోర‌కంగా రంగులు మార్చ‌డంలో ఎర్ర‌బెల్లి త‌ర్వాతే ఎవ‌రైనా అని ఊస‌ర‌వెల్లికి కూడా సాధ్య‌ప‌డ‌ని విధంగా రంగులు మార్చ‌డం ఎర్ర‌బెల్లికే చె ల్లిం దంటూ సెటైర్లు వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: