ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ ఇండియాపై విమర్శలు చేస్తూనే ఉన్నది. విమర్శలు చేస్తూనే.. మరోవైపు బాణాలు ఎక్కుపెడుతూ ఇండియాపై విరుచుకుపడుతున్నది.  బోర్డర్ లో కలకలం సృష్టిస్తోంది.  ప్రతి విషయాన్ని ఇండియా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నది.  పాక్ కవ్వింపు చర్యలకు సమాధానం చెప్తున్నదిగాని, ఇండియా ఎప్పుడు ఈ విషయంలో ముందుగా  రియాక్ట్ కావడం లేదు.  


పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయం బహిరంగ రహస్యం.  ప్రపంచ దేశాలన్నింటికీ ఈ విషయాలు తెలుసు.  అయినా సరే.. పాక్ మాత్రం తన తప్పులేదు అని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది.  ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పటికే అన్ని దేశాలకు అర్ధం అయ్యింది. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచదేశాలు ఫండ్ ఇస్తుంటే.. పాక్ ఆ డబ్బును ఉగ్రవాదులను పెంచి పోషించేందుకు ఉపయోగిస్తోంది.  


దీంతో పాక్ ను ఎఫ్ఏటిఎఫ్  సంస్థ గ్రే లిస్ట్ లో పెట్టింది.  నిధులు ఇవ్వడానికి కావలసిన టర్మ్ అండ్ కండిషన్స్ సరిగా లేవని ఆ సంస్థ చెప్పిన సంగతి తెలిసిందే.  అయితే, పాక్ ను గ్రే లిస్ట్ లో పెట్టడం వెనుక, పాక్ ను లిస్ట్ లోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఇండియా హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.  పాక్ కు ఇలా ఆరోపించడం ఇదేమి కొత్తకాదు.  ఎప్పటినుంచో ఇలా చేస్తున్నది.  


పారిస్ లో జరుగుతున్న ఎఫ్ఏటిఎఫ్  దేశాల సదస్సులో పాక్ పాల్గొన్నది.  ఆ సదస్సులో 288 పేజీల నివేదికను అందించేందుకు సిద్ధం అయ్యింది.  ప్రపంచదేశాలతో ఇండియా మంతనాలు జరిపి పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆ దేశం ఆరోపిస్తోంది.  పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాదులు నిర్మూలనకు సిద్ధమైతే ఇండియా సహాయం చేయడమే కాకుండా, పాక్ దేశానికీ సైనిక పరంగా సహాయం చేస్తామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది.  పాక్ బుద్ది తెలిసి కూడా ఇండియా ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం మన పొరపాటే అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: