రోమ్‌లో రోమ‌న్‌లా ప్ర‌వ‌ర్తించాల‌నే నానుడి మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ ఓ బీచ్ వ‌ద్ద బికినీ వేసుకున్నందుకు ఓ అతిథికి ఫైన్ ప‌డింది. ఎందుకంటే...ఆమె వేసుకున్న బికినీ స్థానిక సంప్ర‌దాయాల‌కు చాలా భిన్నంగా...కానీ ఆమెకు అత్యంత సౌక‌ర్యంగా ఉంది. అందుకే....ఆమె వేసుకుంది...వారు అభ్యంత‌రం పెట్టారు. దీంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఫైన్ వేసి ఇద్ద‌రినీ శాంత‌ప‌రిచారు.


తైవాన్‌కు చెందిన ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఫిలిప్పీన్సుకు విహారయాత్రకు వచ్చింది. సముద్రపు ఒడ్డున విహరిద్దామని.. స్ట్రింగ్ బికినీ వేసుకుని బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీచ్ లోకి వచ్చింది. ఆమెను చూసిన‌వారు షాక్ అయ్యారు. ఎందుకంటే....ఆమె వేసుకున్న బికినీలో నాలుగు దారపు పోగులు తప్ప ఏమీ లేవు. దీంతో బీచ్ లోని టూరిస్టులు అభ్యంతరం చెప్పారు. మరో డ్రస్ వేసుకోవాలని చెప్పినా.. ఆమె వినకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఆ జంటను హెచ్చరించి  పోలీసులు రూ.3 వేల ఫైన్ వేశారు. అయితే, బీచ్‌లోకి వెళ్లే ముందే వారుంటున్న రిసార్టు సిబ్బంది కూడా ఆ డ్రస్ తో బయటకు పోవద్దని సూచించారు. అయినా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లోకి వెళ్లింది. చివరికి జరిమానా వేయించుకుంది.


అయితే, ఈ ఫైన్ క‌ట్టే స‌మ‌యంలో ఆమె పోలీసుల‌తో వాద‌న పెట్టుకుంది. త‌మ‌కు ఫిర్యాదు రావ‌డంతో....బీచ్‌లోకి వచ్చిన పోలీసులు అసభ్యంగా తిరగడం సరికాదని ఆ జంటకు చెప్పారు. కానీ, ఆ యువతి వారి మాటలను లెక్క చేయకుండా ‘ఇదో ఆర్ట్’ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో పోలీసులు వారికి దాదాపు రూ.3100 ఫైన్ వేశారు. తమ దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని, మిగతా టూరిస్టులకు ఇదో మెసేజ్ లాంటిదని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: