మనషులకున్న బలహీనత ఆసరగా చేసుకుని, దాన్నే వ్యాపారంగా మార్చుకుని ఈ సమాజంలో ఎందరో జల్సాగా జీవిస్తున్నారు. అందుకోసం ముఠాలుగా ఏర్పడి. మానవత విలువలను క్రూరంగా మార్చేస్తున్నారు. విలాసాల దారిలో వింతపోకడలతో డబ్బున్న వారిని వలపు వలలో చిక్కుకునేలా చేసి లక్షలకు లక్షలు డబ్బులను ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడిన హనీట్రాప్ వ్యవహారం మరవక ముందే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని కొందరు బడా వ్యక్తులపై వలపు వల విసిరిన ముఠాల బాగోతం వెలుగుచూసింది.


సంపన్నవర్గాలకు చెందిన వారు నివాసముంటున్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని కొందరు బడా వ్యక్తులపై ఐదు ముఠాలు అమ్మాయిలను పంపించి వలపు వల విసిరి, రహస్యంగా పడకగది సన్నివేశాలను వీడియోలు తీసి కోట్లాది రూపాయలను వసూలు చేశారని తేలింది. వీరి వలపు వలలో ఢిల్లీలోని ప్రముఖ బిల్డర్లు, హోటల్ యజమానులు, ఆర్కిటెక్ట్ లు, డాక్టర్లు, నగల వర్తకులు, న్యాయవాదులు  చిక్కారు. వీరి మాయలో పడిన ప్రముఖులు తమ డెబిట్ కార్డులు ఇచ్చి పాస్‌వర్డ్‌లు చెప్పి డబ్బులు చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడు ఈ ముఠా సాగిస్తున్న ఆగడాలతో డబ్బున్న బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాము మోసపోయిన విషయం నలుగురికి తెలిస్తే ప్రతిష్టతో పాటు ఉన్న పరువు గంగలో కలసి పోంతుందని కొందరు నోరు విప్పడం లేదని తెలుస్తుంది.


ఈ బలహీనతే వారికి బలంగా మారింది. ఇలా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జహంగీర్ గ్యాంగ్, మిట్టూ ముఠా, పర్మిందర్, రోహిత్ హనీట్రాప్ గ్యాంగ్, ముకేష్ ముఠాలు పలువురు ప్రముఖులపై వలపు వల విసిరి, పడకగది వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ చేశాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగిన హనీట్రాప్ వ్యవహారం ఢిల్లీ రాజధానికి చేరడంతో ఈ బాగోతంలో పలువురు ప్రముఖులున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వలపు వల బాగోతంపై సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నారు. ఇకపోతే జహంగీర్ హనీ ట్రాప్ ముఠా రూ.2కోట్లు వసూలు చేసిందని, ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా, ముఠా నాయకుడు జహంగీర్ అలియాస్ షేక్ పరారీలో ఉన్నాడని, ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం డీసీపీ తెలియచేసారు..


మరింత సమాచారం తెలుసుకోండి: