అధికారం తెచ్చిన అహంకారం మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చుతుంది. కొన్నిసార్లు తానోక దైవాంశసంభూతుడనని అనుకొనేలా చేస్తుంది. నడమంత్రపు సిరి నరాల మీద పుండు మనిషిని ఒక పట్టాన నిలవనివ్వవు. అదె ఆహంకారం 48 వేల మంది పైగా ఆర్టీసీ కార్మికులు, "సెల్ఫ్-డిస్మిస్ అయ్యారన్న ఆర్డర్" ఇచ్చేవరకు కేసీఆర్ను  పతనోన్ముఖం దారి పట్టించింది. పతనానికి నడిపించింది. ఇప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఇలాంటి ముఖ్యమంత్రి తీరు సహించలేని సీపీఐ  హుజూర్‌ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సీపీఐ పార్టీ నిర్ణయించింది. 
KCR inhumanity on TSRTC employees కోసం చిత్ర ఫలితం
ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ, ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది.  ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసు కోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సీపీఐ అల్టీమేటం జారీ చేసింది. ఇందుకు ఈనెల 13వ తేదీని గడువుగా విధించింది. అయితే ప్రభుత్వం నుంచి గానీ, టీఆర్ఎస్ నుంచి గానీ ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ ఇక్కడి పార్టీ కార్యాలయంలో నేడు అత్యవసర సమావేశం అయింది.
KCR inhumanity on TSRTC employees కోసం చిత్ర ఫలితం
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించారు. సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించు కుంటున్నట్లు ప్రకటించింది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని రక్షించండి అని ప్రభుత్వానికి కార్మిక సంఘాలు మొర పెట్టుకుంటే, 'యూ...ఆర్‌ సెల్ఫ్‌ డిస్మిస్డ్‌' అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రకటించటాన్ని ఆర్టిసీ ఉద్యోగులతో సహా తొలుత సీపీఐ క్షమించలేక పోయింది.


పని చేసిన సెప్టెంబర్ నెలకి పండగ పూట జీతాలు ఇవ్వకుండా 'సెల్ఫ్‌ డిస్మిస్‌' అని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి తన పాలనలో ఉన్నవారిని కన్న తండ్రిలా చూసుకోవాలి. బ్రతిమాలాలి, బుజ్జగించాలి, ఎలాగైనా అంగీకారానికి తీసుకు రావాలి.  ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం వేర్వేరు అనే స్థితిని తీసు కొచ్చేశారు కేసీఆర్‌. ఇతర ఉద్యోగ సంఘాల్ని పిలిపించుకుని, వారిని బుజ్జగించి, ఆర్టీసీ కార్మికుల వైపు వెళ్ళనీయ కుండా చేయడంలో ఘనవిజయం సాధించేశానని కేసీఆర్‌ అనుకోవచ్చుగాక! కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు తమ సత్తా ఎలా చాటారో! కేసీఆర్‌కి తెలియంది కాదు. పైకి కనిపిస్తున్నది 48 వేలమంది కార్మికులే కావొచ్చు, కొత్తగా ఆ 48 వేల ఉద్యోగాలు ఇంకొకరికి ఇచ్చేస్తే, ఉద్యోగాల కల్పన పేరుతో మంచి మార్కులు కొట్టేయొచ్చని ఆయన కుహనాబుర్ర ఆలోచించొచ్చు ఆశించొచ్చు.


కానీ, కేసీఆర్‌ నాటకాలు కొనసాగే పరిస్థితి అయితే లేదన్నది నిర్వివాదాంశం. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత తెలంగాణ ఉద్యమంలో ఈ బలవన్మరణాలే రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. వాటిని ఏ స్థాయిలో కేసీఆర్‌ బృందం రాజకీయంగా వాడుకుందో?  జనమెరిగిన సత్యం. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడు ఉద్యమంపేరుతో రాజకీయంచేసి, ఇప్పుడేమో, విపక్షాలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో రాజకీయం చేస్తోందని కేసీఆర్‌ బృందం ఆరోపిస్తోంది. ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది?
KCR inhumanity on TSRTC employees కోసం చిత్ర ఫలితం
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గళం విప్పేందుకు రెవెన్యూ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. మరోపక్క, ఇతర ఉద్యోగ సంఘాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. "నేడు  ఆర్టీసీ.. రేపు మీరు.. ఎల్లుండి మరోకరు. తమదాకా వస్తేనే గానీ కేసీఆర్‌ నిజస్వరూపం తమరికి అర్థంకాదు" అంటూ అని కార్మిక సంఘాల నుంచి పోటెత్తుతున్న ప్రశ్నలతో వత్తిళ్ళతో ఇతర శాఖల ఉద్యోగ సంఘాలూ ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి.
KCR inhumanity on TSRTC employees కోసం చిత్ర ఫలితం
ఒక్కటి మాత్రం నిజం. ఆర్టీసీ కార్మికుల సమ్మెని పరిష్కరించడం కేసీఆర్‌ అంత కష్టమైన పని మాత్రం కాదు!  కానీ, ఆయన "వాళ్ళెంత నా ముందు కుంకలు నన్నే ఎదిరిస్తారా!"  అనే రాచరికపు దురహంకారం, దొరతనపు పొగరు — ఆ సమస్యని పరిష్కరించ దలచుకోనివ్వటం లేదు. అంటే ఇక రెవెన్యూ, ఉపాద్యాయ, ఎక్సైజ్, నీటిపారుదల....ఇలా అన్నీ శాఖలు సమ్మెకు మద్దతిచ్చి,  ఆపై వారూ సమ్మె చేస్తే ...."సెల్ఫ్‌ డిస్మిస్‌".. అనే విధానాన్ని కేసీఆర్‌ తనపై తానే ‘బూమరాంగ్’  చేసుకొని "సెల్ఫ్‌ డిస్మిస్‌" అవుతారని అంటున్నారు.  


తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టమవుతోంది. డ్రైవర్ శ్రీనివాస రెడ్డి మరణంతో ఆర్టీసి సమ్మె ఒక్కసారి ఉదృత రూపం దాల్చింది. కార్మికులు, ఉద్యోగుల వరకే పరిమితమైన సమ్మె వ్మవహారం ప్రజా ఉద్యమానికి దారి తీస్తోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలంపడంతో పాటు, వివిధ ప్రజా సంఘాలు ఆర్టీసి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపాయి. తాజాగా ఓయూ విద్యార్థి జేఏసి కూడా సమ్మెకు మద్దతు తెలిపింది. ఆర్టీసి కార్మికుల సమ్మె ప్రజా ఉద్యమంగా మారక ముందే ప్రభుత్వం తీరు మార్చు కోవాలని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: