ఈమధ్యకాలంలో దొంగలు బాగా బారి తెగించారు. మొన్నటికి మొన్న డబ్బులు ఊరికే రావు అన్న లలిత జెవెల్లెర్స్ వారి షొక్ప్ లో 45 కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. ఆ బంగారాన్ని అంత ఎక్కడో నెలలో పూడ్చిపెట్టేశారు ఆ దుండగులు. ఈరోజు ఏకంగా ఆంద్రాబ్యాంకులోనే దొంగతనం చేశారు. 

                    

ఇంకా వివరాల్లోకి వెళ్తే .. చిత్తూరు జిల్లా మొర్దనపల్లె అమర్ రాజా పరిశ్రమలోని యాదమరి ఆంధ్రా బ్యాంకు బ్రాంచిలో భారీగా బంగారాన్ని చోరీ చేశారు. అమరాజా పరిశ్రమ ఆవరణలోని ఆంధ్ర బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. సుమారు 17 కిలోల బంగారాన్ని దొంగలించారు. బంగారంతో పాటు నగదు కూడా చోరీ చేశారు. 

                    

దాదాపు రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది చెప్తున్నారు. కాగా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని లాకర్లను పరిశీలించారు. బంగారు నగలు, నగదు మాయం ఘటనలో బ్యాంకు మేనేజర్‌ పురుషోత్తం పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి నగలు ఎవరు తీశారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. 

                   

బ్యాంకులో చోరీ అయినా నగల మొత్తం విలువ మూడున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నగలు, నగదు మాయంపై బ్యాంకు సిబ్బందిని విచారిస్తూన్నారు. కాగా చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

                       

మరింత సమాచారం తెలుసుకోండి: