తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. సర్కారు తీరుపై మనస్తాపం చెందుతున్న ఆర్టీసీ కార్మికులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొంతు విప్పారు.


తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జెఏసి ఈ నెల 19 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలి అన్నారు పవన్ కల్యాణ్.


ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఖమ్మంలో శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్ లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదు... 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందన్నారు పవన్‌ కల్యాణ్..


ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అనే ఆందోళన అందరిలో కలిగింది.. ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్చించాలి. సమ్మె జఠిలం కాకుండా పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. అంత వరకూ బాగానే ఉంది. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నానని ప్రకటించడమే తప్ప.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించడమో.. లేక.. కార్మిక నాయకులు నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొడమో మాత్రం చేయడం లేదు.


పోనీ అలాగని పవన్ కల్యాణ్ జనసేన ఏమైనా ఆంధ్రాకే పరిమితమైన పార్టీయా అంటే అదీ కాదు.. భవిష్యత్తులో తెలంగాణలోనూ సత్తా చాటతామని పవన్ కల్యాణ్ అవకాశం దొరికినప్పుడల్లా చెబుతుంటారు. మరి ఇలాంటి నాయకుడు.. 50 వేలమంది కార్మికులు సమస్యల్లో ఉన్నప్పుడు వారి భుజం తట్టకపోతే.. ఎలా అలా తట్టేందుకు పవన్ కల్యాణ్ భయపడుతున్నారా.. కేసీఆర్ తో అనవరసంగా శత్రుత్వం ఎందుకని ఆలోచిస్తున్నారా.. ఏమో అది పవన్ కల్యాణ్ కే తెలియాలి.

జోైో

మరింత సమాచారం తెలుసుకోండి: