ఓవైపు ఏపీ ఖజానా ఖాళీ అవుతోందంటూ పత్రికలు ఘోషిస్తున్నాయి. రాష్ట్రం అప్పుల కుప్పుగా మారిందంటున్నాయి. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మేనిఫెస్టో యే భగవద్గీతగా ముందుకెళ్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ రైతు భరోసా మొత్తం..


రైతు భరోసా కింద రైతులు ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందివ్వాలనుకున్నారు. ఒకేసారి కంటే రెండు విడుతలగా ఇస్తే బాగుంటుందని కొందరు సూచన చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవసరమైతే కొంత పెంచి సంక్రాంతి నాటికి రైతులకు సౌలభ్యంగా ఉండే విధంగా కొంతమొత్తాన్ని జతచేసి ఇస్తానన్నారు.


పెట్టుబడిసాయం రూ.13,500 ఇవ్వడానికి సీఎం నిర్ణయించారు. దీన్ని ఖరీఫ్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇచ్చే విధంగా నిర్ణయించారు. ఇది చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఖజానాను ఖాళీ చేసి, వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టి గత చంద్రబాబు ప్రభుత్వం వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి.


ఇలాంటి సమయంలో అదనంగా భారమైనా.. ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని సీఎం అంటున్నారు. ఇలాంటి కార్యక్రమం రైతుల కోసం చేయాలంటే ధైర్యం కావాలి. మనస్సు, రైతు పట్ల ప్రేమ ఉండాలి. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతు కోసం వెనకడుగు వేయకుండా పథకాన్ని అమలు చేశారు. నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌ పెట్టుబడి సాయం పథకాన్ని విస్తృతపరిచి, వ్యవసాయ రంగానికి కొత్త స్వరూపాన్ని తీసుకురావాలని కృషిచేస్తున్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఈ చర్యతో అర్థమైంది.


నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానన్నది.. ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. దీంతో పాటు దేశంలో మొట్టమొదటిసారిగా కౌలురైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. పెట్టుబడిసాయం అందిస్తూ లక్షల మందికి తోడుగా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: