పెళ్లిలో చిన్న చిన్న తప్పులు దొర్లడం సహజం.  చిన్న చిన్న తప్పులు జరిగాయని పెద్దగా గొడవలు చేయకుండా సర్దుకు పోతుంటాయి.  అంతేగాని, జరిగిన  తప్పులను ఎత్తి చూపుతూ తలలకు రక్తం కారేలా కొట్టుకుంటారా చెప్పండి.  అది ఎన్నటికీ జరగదు కదా.  మాములుగా మగపెళ్లి వారికీ ఆడపెళ్లి వారికి మధ్య కీచులాటలు జరుగుతూనే ఉంటాయి.  పెళ్లి అన్నాక ఇది షరా మాములే.  


అయితే, ఇంగ్లాండ్ లోని రమదా పార్క్ అనే హోటల్ లో ఇటీవలే ఓ పెళ్లి జరిగింది.  ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి పెళ్లికోసం హోటల్ ను అంగరంగ వైభవంగా అలంకరించారు.  పెద్ద పెద్ద వాళ్ళు సైతం ఈ పెళ్ళికి హాజరయ్యారు.    ఖరీదైన పెళ్లి కాబట్టి మ్యూజిక్ ను కూడా ఏర్పాటు చేశారు.  అంతా క్యాపీగా సాగిపోతున్నది.  మ్యూజిక్ కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు.  కొంతమంది డ్యాన్స్ చేసి అలసిపోయి కూర్చున్నారు.  అంతా సవ్యంగా జరుగుతున్నది అనుకుంటుండగా.. ఏమైందో తెలియదు.. సడెన్ గా అక్కడ యుద్ధవాతారణం నెలకొన్నది.  


హిందోళ రాగంలో ఆందోళన మొదలైంది.  ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.  కుర్చీలు, స్టాండ్లు, లైట్లు ఆయుధాలుగా మారిపోయాయి.  తలల నుంచి రక్తాలు కారుతున్నాయి.  అంతలా ఎందుకు కొట్టుకున్నారో అర్ధం కాలేదు.  హోటల్ సిబ్బందికి ఏం చేయాలో అర్ధం కాలేదు. పెళ్ళికి వచ్చిన అతిదులంతా ఇలా కొట్టుకోవడంతో అందరు షాక్ అయ్యారు.  


హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చి.. కింద పోలీసులు ఉన్నారు.  దయచేసి ఈ గొడవను ఆపండి అని చెప్పినా ఆవేశంలో ఉన్న వాళ్ళు  ఆగలేదు సరికదా మరింత రెచ్చిపోయారు.  ఇంకేముంది.. ఈలోగా అక్కడికి పోలీసులు వచ్చారు.  జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళను సముదాయించారు.  రక్తం కారుతున్న వ్యక్తులకు ఫైట్ ఎయిడ్ చేశారు.  అనంతరం కేసు నమోదు చేసుకొని దానికి బాధ్యులైన వ్యక్తులను అరెస్ట్ చేశారు.  భారీగా ఖర్చు చేసి అంగరంగ వైభంగా పెళ్లి జరిపించాలని అనుకుంటే.. అదికాస్తా రణరంగంగా మారిపోయింది.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: