ప్రధాని మోడీ .. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు తమిళనాడులోని మహాబలిపురంలో మీట్ అయ్యారు.  రెండు దేశాల మధ్య సదస్సు మహాబలిపురంలో జరిగింది.  ఈ సదస్సులో అనేక విషయాల గురించి చర్చించుకున్నారు.  అంతేకాదు, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరిగాయి.  బోర్డర్ సమస్యల గురించి చర్చించుకున్నారు.  ఈనెల 11 వ తేదీన మహాబలిపురంలో మోడీ, జిన్ పింగ్ లు శోర్ దేవాలయంలో మీట్ అయ్యారు.  


దేవాలయానికి సంబంధించిన వివరాలను మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు వివరించారు.  అంతేకాదు, మోడీ, జిన్ పింగ్ ల సమావేశం జరగబోతున్నది కాబట్టి, మహాబలిపురం దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అద్భుతంగా తీర్చి దిద్దారు.  దీంతో మహాబలిపురంకు కొత్త శోభ వచ్చింది.  ఈ మీటింగ్ పూర్తికాగానే.. మహాబలిపురం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.  


రోజు పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉంటుంది.  కానీ, ఈ సదస్సు పూర్తైన తరువాత మహాబలిపురానికి సందర్శకుల తాకిడి పెరిగింది.  ఏకంగా లక్షలమంది మహాబలిపురాన్ని సందరిస్తున్నారు.  ఈ సంఖ్యా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దటంతోపాటు, అంతకు ముందు అనుమతులు లేని చోట్లకు కూడా పర్యాటకులను అనుమతించారు. 


దీంతో ప్రజలు పెద్దఎత్తున మహాబలిపురం చేరుకొని అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.  ఈ తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  ఇలా రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో.. తమిళనాడు ప్రభుత్వానికి ఆధారం పెరుగుతున్నది.  తమిళనాడు దేవాలయాల్లో ఇలా మోడీ సదస్సులు నిర్వహిస్తే.. ఆ దేవాలయాలకు సందర్శకుల సంఖ్య మరింతగా పురుగుతుంది.  ఏమంటారు పళనిస్వామి గారు.  ఆదాయం ఫుల్ గా వస్తున్నది.  వీకెండ్స్ లో మాములుగా ఇలాంటి ప్లేస్ లకు తాకిడి ఎక్కువుగా ఉంటుంది.  మోడీ సందర్శించి వెళ్లిన తరువాత ఈ తాకిడి మరింతగా పెరగడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: