బీచ్ కు వెళ్తే అక్కడి అందాలను తనివితీరా ఆస్వాదిస్తాం.  బీచ్ లో ఎంజాయ్ చేస్తాం.  అదే విదేశాల్లో బీచ్ లకు వెళ్తే అక్కడ విదేశీ వనితలు వేసుకునే బికినీలు చూసి ఆనందిస్తాం.  నేత్రానందంతో హ్యాపీగా తిరిగి వస్తాం.  అయితే, తైవాన్ కు చెందిన ఓ ప్రేమ జంట ఫిలిప్పీన్స్ లోని బొరకే లో ఉన్న పుకా బీచ్ కు వెళ్లారు.  అక్కడ బీచ్ లో అందరిలా బికినీ వేసుకొని ఫోజులు ఇచ్చింది టింగ్ అనే యువతి.  


ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె ఫోటోలను తీశారు.  ఆమె ఆ బీచ్ లో ఉన్నంతసేపు అందరి కళ్ళు ఆమెవైపే ఉన్నాయి.  కారణం ఏంటి.. అందరు బీచ్ లో బికినీలు వేసుకున్నారు కదా.. మరి అంతా ఆమెను చూడటం ఏంటి.. ఎందుకు అలా అంటే అక్కడికే వస్తున్నా.. బీచ్ లో ఆ అమ్మాయి వేసుకున్న బికినీ చూస్తే ఎవరైనా ఆమెవైపే చూస్తారు.  గుడ్డ పీలికలా ఉండే చిన్న బికినీ వేసుకుంది.  ఇంకా చెప్పాలి అంటే అది వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే.. అలాంటి బికినీ వేసుకొని బీచ్ కు వచ్చింది.  


అది చూసి అందరు షాక్ అయ్యారు.  ఇక ఆ యువతి తన ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఈ విషయం బొరాకే ఇంటర్ ఎజెన్సీ రిహబిలేషన్ మేనేజ్మెంట్ గ్రూప్ దృష్టికి వెళ్ళింది.  వెంటనే వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేశారు.  హోటల్ లో ఉన్న యువతిని, ఆమె బాయ్ ఫ్రెండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  కానీ ఆ యువతి మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన శరీరానికి సరిపడే బికినీ వేసుకున్నట్టు చెప్పింది.  


తైవాన్ లో ఉండగా అలాంటి డ్రెస్ వేసుకున్నానని చెప్పింది.  ఆ డ్రెస్ తనకు కంఫర్ట్ గా ఉందని, చెప్పింది.  కానీ, ఫిలిప్పీన్స్ రూల్స్ ప్రకారం లోపలి భాగాలు బయటకు కనిపించే విధంగా డ్రెస్ చేసుకోవడం నేరంగా భావించి ఆమెకు జరిమానా విధించారు.  చేసేది లేక జరిమానా కట్టి ఆ జంట ఆ దేశం నుంచి బయటపడింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: