ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక గత  అసెంబ్లీ ఎలక్షన్ లో  ప్రతిపక్ష టీడీపీ ని చిత్తుగా ఓడించి భారీ మెజారిటీతో విజయం సాధించింది వైసిపి పార్టీ. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్  అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతున్నాయి . ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే  కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 

 

 

 

 

 ఇక లక్షా ఇరవై వేలకు పైగా గ్రామ వార్డు  సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి... పరీక్షలు నిర్వహించి ఫలితాలను పదిరోజుల్లోనే విడుదల చేసి రికార్డు సృష్టించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కాగా  ఈ పరీక్షల్లో ఎంతో మంది విజయం సాధించారు. ఈ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు  శిక్షణ అందించి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేర్చేందుకు  ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకేసారి లక్షా ఇరవై వేలకు పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ,  భర్తీ చేసిన రికార్డును  సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగుల కోసం మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. దీని కోసం వివిధ శాఖల అధికారులతో చర్చించారు జగన్ మోహన్ రెడ్డి. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నిర్ణయించింది ప్రభుత్వం. 

 

 

 

 

 ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులతో సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆయన ఆయన అన్ని శాఖల అధికారులను  కోరారు. అయితే అన్ని శాఖల వద్ద నుండి  పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రతి జనవరి నెలలో ప్రభుత్వం ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ విషయమే కాకుండా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: