విజయవాడకు ప్రమాదం ఉండటం ఏంటి అని షాక్ అవ్వకండి.. ప్రమాదం అంటే.. ఏదో ఉగ్రవాదుల దాడులు జరుగుతాయనే లేదంటే మరొకటో కాదు.  ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా హైదరాబాద్ నగరానికే ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రకలకలం జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయని ఒక నానుడి ఉన్నది.  అందుకే చాలామంది దేశం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.  దేశం ప్రశాంతంగా ఉంటేనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది.  


ఇది వేరే సంగతి అనుకోండి.  ఇప్పుడు విజయవాడకు వచ్చిన ప్రధమాదం ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.. ప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది.  పర్యావరణానికి తగ్గట్టుగా భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి.  భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతున్నది.  ఈ ఒత్తిడి కారణంగా జరిగే రాపిడికి భూమి అదురుతుంది.  దాన్ని భూకంపం అంటారు.  భూకంపం మనదేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటుంది.  


హిందూకుష్ పర్వతశ్రేణిలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎక్కువగా కదులుతుంటాయి.  ఫలితంగా ఆ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువ.  ఇటీవలే  హిందూకుష్ కేంద్రంగా వచ్చిన భూకంపం కారణంగా పాక్ లో భారీ భూకంపం వచ్చింది.  అటు నేపాల్ కూడా ఈ పరిధిలోనే ఉన్నది.  ఇప్పుడు విజయవాడ కూడా ఈ జోన్ కిందకు వచ్చినట్టు తెలుస్తోంది.  దేశంలో 50 నగరాలను భూకంపం వచ్చే నగరాలుగా గుర్తించారు.  అందులో విజయవాడ కూడా ఉన్నది.  


ఈ 50 నగరాలను మూడు భాగాలుగా విభజించారు.  అందులో 13 నగరాలు అధిక భూకంప మండలంలోను, 30 మధ్యస్థ, 7 తక్కువగా ఉన్న నగరాలుగా గుర్తించారు.  ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, పూణే, ముంబై, అహ్మదాబాద్, సిలిగురి, డార్జిలింగ్, చండీగఢ్ తో పాటు విజయవాడ కూడా అధిక భూకంప మండలంలో ఉన్నట్టుగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక పేర్కొన్నది. ఆయా ప్రాంతాల్లో భూకంపాలు వస్తే వాటి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  సో, విజయవాడకు ఈ రకమైన ముప్పు ఉందన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: