ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలోనే రైతులకు చేయూతనిచ్చేందుకు రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే మొదట ప్రభుత్వం శ్రీకారం చుట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకు చేయూతనిచ్చేందుకు రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా 12,500 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతులు,  రైతు ప్రతినిధి సంఘాలతో మరోసారి చర్చించిన ప్రభుత్వం... రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో 12,500 జమ చేయడానికి బదులు మరో వెయ్యి పెంచుతూ 13,500 రూపాయలు జమచేసేందుకు  నిర్ణయించింది.

 

 

 

 

 

 అయితే రైతుల ఖాతాల్లో మూడు విడతల వారీగా ఈ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు జిల్లా కాటుకూరులో  లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులకు రైతు భరోసా చెక్కులను అందించనున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే రైతు భరోసా పథకానికి గాను 5,510 కోట్లను కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే సొమ్ము ని మూడు విడతల వారిగా చెల్లిస్తామంటున్న  ప్రభుత్వం... మే నెలలో  7,500 రూపాయలు... రబీలో 4వేల  రూపాయలు, సంక్రాంతికి 2వేల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

 

 

 

 ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు గుర్తించిన 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ కానుంది.కేంద్ర ప్రభుత్వ  అర్హత సాధించని రైతులకు కూడా ఏపీ ప్రభుత్వమే స్వయంగా 13,500 రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ కేంద్రం నుంచి 4000 అందించి ఉంటే ఇప్పుడు 7500 రూపాయలు రైతులకు ఖాతాలో జమ అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు అందజేయనున్న రైతు భరోసా పథకంలో ... 11,500 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుండగా...  రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఏపీ రైతులందరికీ మూడు విడతల వారీగా 13,500 తమ తమ ఖాతాలో జమ కానున్నాయి. అయితే ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే 1100 లేదా 1902 టోల్ ఫ్రీ నంబర్లకి  ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: