ఆర్టికల్ 370 రద్దును చాలా పార్టీలు సమర్ధించాయి.  అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆర్టికల్ 370 రద్దును  పెద్ద రాద్ధాంతం చేస్తోంది.  ఇప్పటికి కూడా రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తూనే ఉన్నది.  జమ్మూ కాశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ఇబ్బందులు వస్తాయని, అక్కడ అలజడులు, గొడవలు జరుగుతాయని చెప్తోంది.  గొడవల కారణంగా అక్కడి ప్రజలకు రక్షణ ఉండదని వాదిస్తోంది కాంగ్రెస్.  కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు.  70 రోజుల తరువాత ఇప్పుడు అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.  


ఎక్కడా ఎలాంటి గొడవలు జరిగినట్టుగా వార్తలు రావడం లేదు. అక్కడి ప్రజలు అర్ధం చేసుకున్నారు.  అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.  దీనిని మోడీ ప్రభుత్వం ప్రజల విజయంగా చెప్తూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నది.  హర్యానాలో మోడీ ఇదే విషయంపై మాట్లాడారు.  ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంతటి మక్కువో చెప్పాలని అన్నారు.  ఆర్టికల్ 370 అమలులో ఉన్నప్పుడు అనేకమంది ఆర్మీ జవానులు ప్రాణాలు కోల్పోయారని, వారికీ అక్కడ ఎలాంటి అధికారాలు లేకుండా ఆర్టికల్ 370 చేసిందని ఫలితంగా దేశానికీ రక్షణగా నిలిచిన వేలాదిమంది సైనికులు మృత్యువాత పడ్డారని అన్నారు.  


హర్యానాకు చెందిన ఎందరో జవానుకు ఆర్టికల్ 370 కారణంగా మరణించినట్టు చెప్పారు.  ఆర్టికల్ 370పై ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వీరికి ఏమని సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.  ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటె.. దానిని మ్యానిఫెస్టోలో పెట్టాలని, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టాలని సవాల్ విసిరారు.  జమ్మూ కాశ్మీర్ దేశంలో పూర్తిగా విలీనం కావడంతో దేశంలోని ప్రతి పౌరుడు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు.  మనది కాదేమో అనుకోని సందేహిస్తున్న ప్రజలకు ఎస్ ఇది మనదే అని గర్వంగా చెప్పుకుంటున్నాడు.  


ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఆర్టికల్ 370 ని తిరిగి జమ్మూ కాశ్మీర్లో తీసుకొస్తాము అని చేప్తే.. ఇంకేమైనా ఉన్నదా.. అసలే పార్టీ దేశంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.  ఈ సమయంలో పార్టీ ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే.. దానివలన ఆ పార్టీ మనుగడ దాదాపుగా అసాధ్యం అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం వచ్చే వరకు ప్రధాని మోడీ ఈ ప్రశ్నను సందిస్తూనే ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: