ఏపీలో లోకల్ ఫైట్ కి రంగం సిధ్ధమవుతోంది. ఇప్పటివరకూ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిపించాలని ఏపీ సర్కార్ దాదాపుగా  డిసైడ్ అయిందంటున్నారు. స్థానిక ఎన్నికలకు వైసీపీ ప్రభుతం రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. బంపర్ విక్టరీతో ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న జగన్ ఈ వూపుని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎన్నికలు ఎంత వేగంగా అయితే అంత వేగంగా  పెట్టి మొత్తం ఏపీ తనవైపు ఉందని చాటి చెప్పాలనుకుంటున్నారు.


ఇందులో భాగంగా ముందు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిపించాలని జగన్ ఆలోచిస్తున్నారుట. ఈ మేరకు మునిసిపల్ శాఖ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్తమానాలు వచ్చినట్లుగా చెబుతున్నారు. వార్డుల రిజర్వేషన్లు త్వరగా  పూర్తి చేయలని, ఎన్నికలకు అన్నీ సిధ్హం చేసి ఉంచాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.  ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా అందుకో కోరారు.


ఇదిలా ఉండగా ఏపీలో మరో యాభై కొత్త మునిసిపాలిటీలను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయిచింది. వాటిని కూడా కలుపుకుని మొత్తం 150 వరకూ మునిసిపాలిటీలకు ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇపుడు అనేక సంక్షేమ పధకాలను వరసగా ప్రకటిస్తున్న జగన్ వాటి వల్ల పెద్ద ఎత్తున పాజిటివ్ ఓటింగ్ వస్తుందని భావిస్తున్నారు.


అదే సమయంలో దారుణమైన ఓటమితో ఉన్న టీడీపీ ఇప్పట్లో కోలుకోలేదని కూడా జగన్ అనుకుంటున్నారుట. ఈ పరిణామాల క్రమంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే వైసీపీకి పూర్తి ఎడ్జి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ మున్సిపోల్స్ కి నగారా మోగే అవకాశలు ఉంటాయని అంటున్నారు.  మరో యుధ్ధానికి రెడీ అయినట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: