తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంగా తయారైంది. ఒక పక్క హుజుర్ నగర్ ఉప ఎన్నిక, మరో పక్క సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో సిపిఐ తమ టీఆరెస్ ఎన్నికల పొత్తును వెనక్కి తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. సీపీఐ మద్దతు ఎందుకు ఉపసంహరించుకుందోనన్న అంశంపై టిఆర్ఎస్ ఆలోచించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రోజుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అనే అంశంపై మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామన్న ఆ పార్టీ పొత్తును తెగతెంపులు చేసుకునేందుకు అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైంది. హుజూర్ నగర్ లో మంగళవారం  కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తుమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై చర్చిస్తామన్నారు. 


సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో  ఆయన మాట్లాడారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రకటించిన మద్దతును ఉపసంహ రించుకుంటున్నట్లు సిపిఐ ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజైన సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉదృతంగా సాగింది. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగారెడ్డి జిల్లా సదాశివనగర్‌ వద్ద సోమవారం సాయంత్రం ప్రైవేటు డ్రైవర్‌ నడుపుతన్న ఆర్‌టిసి బస్సు టాటా ఏస్‌ను ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. మృతులు పుల్కల గ్రామానికి చెందిన వారు. ఇప్పటికైనా  కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రం నుండే ఉందన్నారు.తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో  టిఆర్ఎస్ కు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నామని సీపీఐ వెల్లడించింది.




ఈ మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా కార్మికుల ఆత్మహత్యలకు కారణమౌతున్న అధికార టిఆర్ఎస్ పార్టీకి తాము మద్దతు ఇవ్వలేమని సీపీఐ తెలిపింది. రోజు కొక ఆత్మ హత్య జరుగుతున్నా నేరుగా రంగం లోకి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగం ఏమిటని నిలదీశారు. మరోవైపు టిఆర్‌ఎస్‌నేత కె కేశవరావు కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కారణంలో ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో కేశవరావు సమావేశమయ్యే అవకాశం ఉందని గులాబీ దళం పేర్కొంటుంది. దీనితో ఆర్టీసీ సమ్మె ఒక కొల్కి  వచ్చే అవకాశం ఉందంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: