నాడు పివి నరసింహారావు తాను సరళీకరించిన ఆర్ధిక విధానాల వెల్లువలో ప్రవహించిన మురికిలోనే కొట్టుకుపోయారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదే "మసి" అంటి అధికారం కోల్పోయారు. వీరిద్ధరు సంస్కరించిన అర్ధిక విధానాల లోసుగుల్లొని కంతల్లో కొందరు అక్రమార్కులు అవినీతి కార్యక్రమాలతో తమ అత్యాశలను నిజం చేసుకొని చక్కబెట్టుకున్నారు.  

Image result for abhijit banerjee

అభిజిత్ బెనర్జీ నోబుల్ థాట్:  

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రవాస భారతీయుడు నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉంది. ప్రస్తుత వృద్ధి రేటును చూసిన తర్వాత, దాని పునరుజ్జీవనం గూర్చి ఖచ్చితంగా చెప్పలేము. గత ఐదారు సంవత్సరాల్లో కొంత వృద్ధిని సాధించాము. కానీ, ఇప్పుడు ఆ హామీ కూడా లేకుండా పోయింది" అని అభిజిత్ తీవ్రంగా విమర్శించారు. 

పశ్చిమ బెంగాల్ మూలాలున్న ప్రఖ్యాత ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీని ఇటీవల ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించిన విషయం తెలిసిందే. ప్రపంచం లో పేదరికాన్ని నిర్మూలించేందుకు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకుగాను అభిజిత్‌తో పాటు ఆయన సతీమణి ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కిన విషయం విదితమే.

అయితే ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చేద్ధామనే అభిజిత్ కాంగ్రేస్ మానిఫెస్టోలో ప్రస్థావించిన “న్యాయ్” సూత్రధారి అని అంటారు. వీళ్ళంతా సరళీకృత విధానాలనే సమర్ధిస్తారు. ఆర్ధిక విధానాలపై ఎంతో కొంత నియంత్రణలు ఉండకపోతే దేశానికి మిగిలేది బూడిదే.  

Image result for raghuram rajan & abhijit mukharji
రఘురాం రాజన్ ఆర్ధిక చిదంబర రహస్యం 

ఎప్పుడూ బీజేపి ఆర్ధిక విధానాలపై విరుచుకూడే “భారతీయ రిజర్వ్ బ్యాంక్” మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి కేంద్ర ఆర్థిక విధానాలపై అగ్నివర్షం నిప్పులు చెరిగారు. విభజన, మెజార్టీవాదం దుష్పలితాలు ఇస్తాయని విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు భిన్నంగా రఘురాం రాజన్ పలుమార్లు స్పందించారు. 

*నోట్ల రద్దును ఆయన వ్యతిరేకించారు. 
*మెజార్టీవాదం, 

భారత జాతీయ భద్రతను బలోపేతం చేయదని, అంతర్గత సమైక్యత, ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మెజార్టీవాదం జాతీయ భద్రతను మెరుగుపరుస్తుందనే వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని రఘురాం రాజన్ అన్నారు. దీంతో జాతీయ భద్రతను బలహీన పరుస్తున్నారని విమర్శించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం "తమదైన నిబంధనల జాతీయ సమైక్యత" ను కోరుకుంటున్నారన్నారు. మెజార్టీ జాతీయవాదం అంతర్గతంగా విభజించబడిందన్నారు. కొంతమంది పౌరులను 'ఇతరులు' గా ముద్ర వేస్తున్నారన్నారు. 

విభజన, ప్రజాస్వామ్య మెజార్టీవాదం కాకుండా అంతర్గత సమైక్యత, ఆర్థికాభివృద్ధి జాతీయ భద్రతకు దీర్ఘకాలంలో భారత్‌ కు మూలంగా ఉంటుందని తన అభిప్రాయం అన్నారు.మరోవైపు, భారత ఆర్థిక పరిస్థితులపై రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చింది. దేశ ఆర్థిక లోటును దాచిపెడుతున్నారని, అదే జరిగితే ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థస్థాయి నుంచి భారత్ రేటింగ్ తగ్గిస్తుందన్నారు. అసలు సమస్య ఏమంటే దేశం కొత్త వృద్ధి వనరులను గుర్తించలేదని, అలాగే కొన్నాళ్లుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించ లేదన్నారు. ఎన్ బి ఎఫ్ సీ ల లిక్విడిటీ సమస్య, పెట్టుబడి మందగమనంను ప్రస్తావించారు. 

ప్రపంచమే ఆర్ధిక మందగమనం దిశగా పయనిస్తున్నప్పుడు ఈ సరళీకృత ఆర్ధిక విదాన వాదుల వాదన సమయోచితంగా కనిపించట్లేదని అంటున్నారు మరికొందరు ఆర్ధికవేత్తలు. రావు-సింగ్ లిబరలైసెద్ ఎకానమీ గురించి మాట్లాడిన పరకాల ప్రభాకర్ కూడా ఈ కోవలోకే వస్తారు. నియంత్రణ లేని రావు-సింగ్ లిబరలైసెద్ ఎకానమీ ఈ దేశాన్ని ఆర్ధిక నేరాలలో దోపిడీల లోయల్లోకి తోసేసిందన్నది మరవరాదు. 

రాజకీయ అవినీతి దేశంలో రావు-సింగ్ లిబరలైస్డ్ ఎకానమీ అమలు తరవాత తరవాత వరదలై పారింది. నాటి పాపాల వలన భారతీయ బాంకింగ్ వ్యవస్థ అవ్యవస్థగా మారిందని చెప్పక తప్పదు.  ప్రజలకు జాతి సంపదను పంచిపెట్టే ధోరణి, వారిలో సోమరితనం పెంపొందిస్తుంది. కష్టపడి చమటోడ్చిన వారికి — చేసుకున్నవారికి చేసుకున్నంత సంపద— లభించే సిద్ధాంతాలను రూపొందిస్తే భారత్ లాంటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంతరాలు అసమానతలున్న సమాజం కొంతైనా వికసిస్తుంది. 

ఈ మేధావులు "థియరిష్టులు" మాత్రమే. ఇప్పుడు దేశానికి వచ్చిన ఆర్ధిక సంక్షోభం, ప్రపంచమంతా ఉంది. అభిజిత్ - రాజన్ లు ఉన్న అమెరికా కూడా ఆ దారిలోనే పయనిస్తున్నదని మరవకూడదు. అయితే ఇంతమంది ఆర్ధిక వేత్తలు సూచించే "రావు-సింగ్ ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్ధిక విధానాల్లోని దేశ ఆర్ధిక అభివృద్ధికి లేదా ఊతమిచ్చే, ప్రేరితం చేసే విషయాలను పరిశీలించటం" అవసరమైతే తప్పుగాదని నరెంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొందరు ఆర్ధశాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: