పవన్ కళ్యాణ్. ఇవి రెండు పేర్లు.. ఒక పేరు పుట్టినప్పటిది. రెండవపేరు సినీరంగం పెట్టినది. ఈ రెండు పేర్లు కలిపి పవన్ కి లక్ తెచ్చాయి. పవర్ స్టార్ అయ్యాడు. అయితే పవన్లో ద్వైదీభావానికి సూచికగా కూడా ఈ రెండు పేర్లు చెప్పి సెటైర్లు వేసేవారూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లో రెండేంటి ఎన్నో భావాలు ఉన్నాయని అనే వారూ ఉన్నారు. పవన్ మరి పవన్ వాటిని అన్నింటికీ ఒకే చోట చేర్చి ఒక వైపే చూపు పెడితే బాగుంటుందనే వారూ ఉన్నారు. రెండు వైపులా చూస్తూ సవ్యసాచిలా బాణాలు వేయమనేవారూ ఉన్నారు.


ప్రస్తుతం ఈ రకమైన కంఫ్యూజన్లోనే పవర్ స్టార్ కూడా ఉన్నారట. ఆయన బేసిగ్గా సినిమా హీరో. పవన్ నటుడిగా పాతికేళ్ల ప్రస్థానం ఉంది. ఆయన రాజకీయ నాయకుడిగా అయిదేళ్ల ప్రస్తానం ఉంది. ఇపుడు రాజకీయాల్లో పవన్ చెసే పని పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుచేతంటే ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. రెండు చోట్ల పోటీ చేసి రెండూ పోగొట్టుకున్న పవన్ ఒక పార్టీకి నాయకుడు మాత్రమే. అందువల్ల రాజకీయంగా పవన్ ఇపుడు ఓ విధంగా ఖాళీగానే ఉన్నారు. మరి పవన్ ఈ సమయంలో ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తే ముందు సినిమాల్లో నటించాలి అన్న వారు ఎక్కువమంది ఉన్నారు. వాళ్లలో ఫ్యాన్స్ బాగా కనిపిస్తారు. పవన్ సినిమాలు నటిస్తే చూడాలని వారి ఆరాటం.


అయితే పవన్ మాత్రం తాను రాజకీయాలకే అంకితం అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ పవన్ అయిదేళ్ల పాటు పార్టీని నడపాలి. ఈ లోగా జనంలో ఎన్నో మార్పులు వస్తాయి. పవన్ లో సినిమా నటుడిని చూసి ఇష్టపడిన వారే ఎక్కువ. ఆయనకు బ్రహ్మాండమైన సిన్మా  ఇమేజ్ ఉంది. దాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేస్తే ఆ ఇమేజ్ రాజకీయాలకు కూడా ఉపయోగపడుతుందని అనేవారూ ఉన్నారు.


పవన్ మంచి సినిమాలు, సందేశం ఉండేలా చూసుకుని ఈ అయిదేళ్ళలో కొన్ని చేస్తే మళ్లీ ఆయనకు రాజకీయంగా కూడా అది పలుకుబడి పెంచుతుందని అంటున్నారు. మరి పవన్ సినిమాలు చేస్తారా. లేక రాజకీయాల్లో ఉంటారా. రెండు పడవల్లో కాలు పెట్టడం వద్దు అనుకుంటారా. ఏది ఏమైనా పవన్ తో సినిమాలు తీయాలని నిర్మాతలు ఉంటే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో.


మరింత సమాచారం తెలుసుకోండి: