తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కి తను పదవిలోకి వచ్చిన చాలా నాళ్ల తర్వాత అతి పెద్ద సవాలు ఎదురయింది. ఏదో గాలివాన కొట్టుకొనిపోతుంది అనుకున్నా ఆర్టీసీ సమ్మె కాస్తా శ్రీనివాస్ మరణంతో చాలా తీవ్రంగా మారింది. ఇప్పుడు ఈ సెగ మరింత పెరిగి ఇతర డిపార్ట్మెంట్స్ కు కూడా అంటుతోంది. ఇప్పటికే దసరా సెలవులను అక్టోబరు 19వ తేదీ వరకు పొడిగించి కెసిఆర్ చాలా చెడ్డ పేరు మూటకట్టుకున్నాడు. అంతకుమించి పొడిగించాలంటే మాత్రం విద్యాసంస్థలు కచ్చితంగా ఒప్పుకోవు. సరే అలాగే వాటిని నడుపుదాం అన్న బస్సులు అందుబాటులో లేక పోయే..! కాబట్టి రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమంగా మారను న్న విషయం మనకు అర్థమవుతుంది.

ఇకపోతే ఆర్.టి.సి సమ్మెను ఆపగలిగే సత్తా ఉన్న నాయకుడు హరీష్ రావు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి వరకు ఆర్టీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన హరీష్ రావు కి యూనియన్ లతో సత్సంబంధాలు ఉన్నాయి. అందులో చాలామంది అతనికి వ్యక్తిగతంగా బాగా పరిచయం మరియు ఇప్పుడు సమ్మె ముందుండి నడిపిస్తున్న అశ్వత్థామరెడ్డి హరీష్ రావు ప్రోత్సహించి ఆదరించినవాడే. అశ్వత్థామ రెడ్డిని హరీష్ రావే ఉన్నత పదవులు ఇస్తూ మంచి స్థాయికి చేర్చాడు. హరీష్ రావును కాని మధ్యరికానికి పంపితే ఇరువైపులా మేలు జరిగేటట్లు చూసుకొనిరాగల కెపాసిటీ ఉన్న నేత.

కానీ కేసీఆర్ మాత్రం ఈ సమయంలో హరీష్ రావు సహాయం కోరితే తన చేతగానితనం బయటపడడమే కాకుండా హరీష్ రావు స్ఠాయి కూడా పెరుగుతుంది అన్న ఉద్దేశంతోనే అతన్ని ముందుకు రానివ్వడం లేదని అంతా అనుకుంటున్నారు. కానీ ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కేసీఆర్ జాగ్రత్త పడకపోతే ఎప్పుడెప్పుడా అని విపక్షాలు మరియు మరీ ముఖ్యంగా బిజెపి కాసుకొని ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్లి హరీష్ రావు చేతిలో పెట్టడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: