దసరాపండగ సెలవులను తెలంగాణా ప్రభుత్వం పొడిగించక తప్పలేదు. మామూలుగా సమైక్య రాష్ట్రంలో దసరా పండుగకు ఇన్ని రోజులు సెలవులు ఇచ్చింది లేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇవ్వలేదు కానీ ఈసారికి ఇవ్వక తప్పలేదు. సెలవుల తర్వాత విద్యాసంస్ధలు పునః ప్రారంభించేసమయానికి ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతుండటంతో సెలవులను పొడిగిచంక వేరే దారి కనబడలేదు కెసియార్ కు.

 

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరగటం లేదు కాబట్టి విద్యాసంస్ధలకు సెలవులు పొడిగించటమన్నది ఓ కారణం మాత్రమేనట. అసలు కారణం ఏమిటంటే విద్యార్ధి సంఘాలను సమ్మెకు దూరంగా ఉంచటంలో భాగంగానే కెసియార్ విద్యాసంస్ధలకు సెలవులను పొడిగించారని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.

 

సిటిలో వేలాదిమంది విద్యార్ధులు తమ స్కూళ్ళకు గానీ కాలేజీలకు వెళ్ళటానికి కానీ బస్సులను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది వాస్తవం. ఎవరైనతే బస్సుల్లో వెళుతున్నారో వాళ్ళకంతా ట్రాన్స్ పోర్టేషన్ బాగా ఇబ్బందిగా తయారైంది. దీన్ని సాకుగా పెట్టుకుని కెసియార్ సెలవులను 19వ తేదీ వరకూ పొడిగించారు. ఈ విషయంలోనే రాజకీయ పార్టీలన్నీ కెసియార్ చర్యపై మండిపడుతున్నాయి.

 

అదే సమయంలో సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు మద్దతుగా విద్యాసంస్ధల్లోని విద్యార్ధి సంఘాలు కూడా సమ్మెలోకి దిగితే వాళ్ళను కంట్రోల్ చేయటం అప్పుడు కెసియార్ తరం కాదన్నది వాస్తవం. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు, విద్యార్ధి సంఘాల పాత్ర తక్కువేమీ కాదు.

 

ఉద్యమ సమయంలో కానీ సిఎం అయిన తర్వాత కానీ కెసియార్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోకి అడుగుపెట్టిందే లేదని గుర్తుంచుకోవాలి. టిఆర్ఎస్ తో సంబంధాలు లేకుండానే ఓయులోని విద్యార్ధి సంఘాలు సపరేటుగా ఉద్యమాలు చేశాయి. ఒకవిధంగా అప్పుడైనా ఇప్పుడైనా ఓయు విద్యార్ధి సంఘాలంటే కెసియార్, టిఆర్ఎస్ నేతలకు భయమనే చెప్సాలి.

 

అందుకనే ఆర్టీసీ సమ్మెలోకి వాళ్ళెవరినీ దిగనీయకుండా కంట్రోల్ చేయటానికే సెలవులు పొడిగించినట్లు విద్యార్ధి సంఘాలు చెప్పుకుంటున్నాయి. సెలవుల్లో ఊర్లకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఊర్లలోనే ఉంటే రాజధానిలో గొడవలుండవని బహుశా కెసియార్ అంచనా


మరింత సమాచారం తెలుసుకోండి: