మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనుండటం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఓ వైపు తమ్ముడు జనసేన పార్టీ పెట్టి జగన్ రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే.. చిరంజీవి వెళ్లి జగన్‌ని మీట్ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైఎస్ జగన్‌తో చిరంజీవి, ఆయన తనయుడి భేటీ విషయమై రకరకాల కారణాలు తెలుస్తున్నాయి. విజయవాడ చేరిన చిరు దంపతులు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే జగన్‌ని చిరంజీవి కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం సైరా నరసింహా రెడ్డి విజయాన్ని ఆయనతో పంచుకొని, తెలుగు సినిమా పరిశ్రమ గురించి చర్చించేందుకే ఈ భేటీ అని తాజా సమాచారం. అలాగే సైరాకు జగన్ అందించిన సహకారం పట్ల కూడా చర్చ సాగనుందని తెలుస్తోంది. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సినిమా పరిశ్రమ నుండి మద్దతు లభించటం లేదు. దీంతో..సినీ పరిశ్రమలో కొందరు టీడీపీకి అనుకూలంగా ఉన్న కారణంగానే జగన్ సీఎం అయినా కనీసం 'మా' కార్యవర్గం సైతం ఇప్పుటి వరకు ముఖ్యమంత్రి జగన్‌ని మర్యాద పూర్వకంగా కలవలేదు అని కామెంట్ చేశారు. చిరంజీవికి కీలక బాధ్యతలు? ఈ నేపథ్యంలో చిరంజీవి, జగన్ ని కలవడం చర్చనీయంశంగా మారింది. అయితే ఈ మీట్ లో చిరంజీవికి ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఒక ప్రతిపాదన సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో సినీ పరిశ్రమను డెవలప్ చేసే బాధ్యతలను పార్టీ పరంగా కాకుండా.. ఆయన ఇష్టపడితే ప్రభుత్వ పరంగా..లేదా స్వచ్చందంగా చేసేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని సహకరాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రతిపాదించనున్నట్లు విశ్వస నీయ సమాచారం. చిరంజీవి స్పందన ఆధారంగా భవిష్యత్ అడుగులు అంటే ఏపీలో స్టూడియోలు, సినీ పరిశ్రమ విస్తరణకు సినీ పరిశ్రమ నుంచి ముందుగా చిరంజీవి కుటుంబం ముందుకు వస్తే మిగిలిన వారు కదులి వస్తారని జగన్ అంచనా అని అంటున్నారు. అందుకే చిరు, రామ్ చరణ్ ఈ మీట్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: