ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమంలాగే  జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో స్పందించవలసి వచ్చే సందర్భాల్లో చంద్రబాబునాయుడు. పవన్ కల్యాణ్ కార్మికుల ముఖప్రీతికోసమా అన్నట్లుగా స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకు వేసి.. ఈనెల 19న జరగనున్న బంద్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. చంద్రబాబునాయుడు మాత్రం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని... అవి ఏ మాత్రం పరిష్కారంనికి  కాదని, బతికి ఉంది సాధించాలని.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు నెల్లూరు నుంచి హితవు చెబుతున్నారు.


ఇక  తమాషా ఏంటంటే.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మనస్ఫూర్తిగా మద్దతివ్వడానికి.. ఆ ఇద్దరు నాయకులకు ముందుకు రావడం లేదు. అలా మద్దతిస్తే మాత్రం...  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ ప్రత్యర్థి జగన్  తీసుకున్న నిర్ణయాన్ని వేనోళ్ల శ్లాఘించినట్టే అవుతుంది అని. అందుకే వారు తెగించి మాట్లాడం చేయడం లేదు.

పవన్ కల్యాణ్ మొదట ఆర్టీసీ వారి సమ్మెకు మద్దతు ప్రకటించారు. వారి ‘న్యాయమైన’ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం తగు నిర్ణయాలు  తీసుకోవాలని తెలిపారు. ఇప్పుడు బంద్ కు కూడా మద్దతిచ్చారు. ఈ మద్దతంతా కేవలం ప్రెస్ నోట్ లకు మాత్రమే పరిమితం కావడం గమనించవలసిన విషయం. తమ పార్టీ శ్రేణులంతా వారికి మద్దతుగా రోడ్ల మీదకు రావాలని.. పవన్ కల్యాణ్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మాత్రం ఏ విధానంగా పిలుపు ఇవ్వలేదు.


ఈ ఇద్దర నాయకులు కూడా.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ధర్మమే.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని అనడం లేదు.  ఏపీలో చేయగలుగుతున్నారు గనుక.. అదే తరహాలో తమను కూడా ప్రభుత్వంలో కలపాలని తెలంగాణలో డిమాండ్ కూడా వచ్చింది. దీనికి పరిపూర్ణ మద్దతివ్వడం అనేది.. ఏపీలో జగన్ నిర్ణయాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: