ఏమీ తెలియని వయసులో కొంతమంది తమను  వేశ్యావృత్తిలోకి దింపడంతో ... వాళ్లకి వేరే లోకం తెలియదు. ఇక వేశ్యవృత్తి నుంచి బయటకు వస్తే ఎక్కడ పరువు పోతుందని భయపడే... బతుకుదెరువు కోసం వొళ్ళు  అమ్ముకొని బతుకుతున్నారు. కానీ వేశ్య వృత్తిలో బతుకుతున్న ప్పటికీ వాళ్ళ ప్రాణాలకు రక్షణ కరువైంది. వేశ్య వృత్తిలో కొనసాగుతూ బతుకుదెరువు సాగిస్తున్న మహిళలకు... శారీరక సుఖం కోసం తమ దగ్గరికి వచ్చిన వాళ్ల దగ్గర నుంచి ప్రాణహాని తప్పట్లేదు. కొంతమంది వేశ్య వృత్తిలో ఉండడం వల్ల అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోతున్నారు.... ఇంకొంతమంది తమ దగ్గరికి శరీర సుఖం కోసం వచ్చిన మృగాల్లాంటి  మగాళ్ల కారణంగా హతం అవుతారు. అయితే శారీరక సుఖం కోసం తన దగ్గరికి ఓ  వ్యక్తిని  ముందు మాట్లాడుకున్న దాని కంటే వంద రూపాయలు ఎక్కువగా ఇవ్వమని సెక్స్ వర్కర్  అడగడంతో... ఆ వ్యక్తి ఆమెని  కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

 

 

 

 

 

 వ్యభిచారానికి మారుపేరైన ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శారీరక సుఖం కోసం ఓ వ్యభిచారి దగ్గరికి  వచ్చిన  వ్యక్తిని  ముందు మాట్లాడుకున్న దాని కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వమని   అడగడంతో తన దగ్గర ఉన్న కత్తితో దారుణంగా పొడిచి ఆ మహిళను చంపేశాడు. ముంబైలోని నాయ్ గావ్  ప్రాంతానికి చెందిన జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి కేటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా కామెటిపుర వెళ్లి  అక్కడ సెక్స్ వర్కర్స్ తో తన కోరిక తీర్చుకుంటుంటాడు  జితేంద్ర కుమార్ సింగ్ .ఈ క్రమంలోనే  ఈనెల 13న కామెటిపుర కి వెళ్ళాడు. 

 

 

 

 

 

 అక్కడ ఒక సెక్స్ వర్కర్స్ తో బేరం మాట్లాడుకున్నాడు  జితేంద్ర కుమార్ సింగ్ . అయితే సెక్స్ వర్కర్ తో సెక్స్ లో పాల్గొన్న తర్వాత ముందు మాట్లాడుకున్న దాని కంటే వంద రూపాయలు ఎక్కువ  ఇవ్వాలని ఆ  సెక్స్ వర్కర్ జితేంద్ర కుమార్ సింగ్ ని కోరింది. అయితే నేను ముందు మాట్లాడిన దానికంటే ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వనని   జితేంద్ర కుమార్ చెప్పాడు . దీంతో సెక్స్ వర్కర్ కి జితేంద్ర కుమార్ సింగ్ కి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఫుల్ గా మందు కొట్టి మద్యం మత్తులో ఉన్న జితేంద్ర కుమార్ సింగ్ కోపోద్రిక్తుడై ... తన దగ్గర ఉన్న కత్తితో ఆ సెక్స్ వర్కర్ కడుపులో పొడిచాడు . అయితే తను ఏం చెయ్యొద్దని  ఆ సెక్స్ వర్కర్ జితేంద్ర కుమార్ సింగ్ ని  వేడుకున్నప్పటికీ ... విచక్షణ రహితంగా ముప్పై సార్లు ఆ మహిళ కడుపు లోకి పొడిచాడు జితేంద్ర కుమార్ సింగ్. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆ మహిళా  రక్తపుమడుగులోనే క్షణాల్లో  ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత జితేంద్ర కుమార్ సింగ్  అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సెక్స్ వర్కర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి... కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సెక్స్ వర్కర్లు విటులను  చూస్తే భయపడిపోతున్నారు.కాగా  కోర్టు అతనికి ఈ నెల 19 వరకు రిమాండును విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: