రాజకీయాల్లో ఉన్న వారికి అవమానాలు, ఆటుపోట్లూ కొత్తేం కాదు. అవన్ని తట్టుకూని ముందుకు సాగితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారు నాయకులు. ఇకపోతే మన లోకేష్ బాబు బండారం ఓ విషయంలో నమ్మశక్యంగా లేదు. అదేమంటే అతను తిన్న చిరుతిండ్ల విలువ లక్షల్లో ఉందట. బాబుగారి గారాల కొడుకు అంతగా ఏం తిన్నాడంటే అవన్ని చిన్నపిల్లలు తినే తినుబండారాలట. పూర్తి విషయమేంటో తెలుసుకుంటే.


రాజకీయ తెరపైకి వచ్చిన తాజా వివాదంతో  చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ బాబు గతంలో ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేసినప్పుడు చేసిన ఖర్చులు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. కేవలం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే లోకేష్‌ బాబు అండ్‌ కో తినుబండారాల ఖర్చు లక్షల్లో ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 2017 నుంచి 2019 మార్చి వరకు చంద్రబాబు, లోకేష్‌బాబుల తినుబండారాల ఖర్చు సుమారు రూ.14లక్షల మేర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.  2017 వరకు వారిద్దరి తినుబండారాల ఖర్చు దాదాపు రూ.12 లక్షల వరకు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌కు చెల్లించారంటే ఏ మేరకు ఖర్చు చేశారో అర్ధం చేసుకోవచ్చు.


ఇకపోతే ఈ ఖర్చంతా కేవలం ఎయిర్‌పోర్ట్‌లో రిఫ్రెష్‌మెంట్‌ కింద చేసిన ఖర్చు మాత్రమే. మరో విషయాం ఏంటంటే ఇప్పుడు బాబు అండ్‌ కో చేసిన ఖర్చు ఇవ్వాలని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి అధికారులను కోరగా, అధికారులు మాత్రం ఆ బిల్లు తాము ఇవ్వలేమని చెబుతున్నారట. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌బాబులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు ఖర్చు చేసిన బిల్లులే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పుకొస్తున్నారు..


ఇక ఈ విషయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ స్పందిస్తూ లోకేషా, చెకోడీలు, చాక్లెట్ల లాంటి తిను బండారాలకోసమే అన్ని లక్షలు ఖర్చు చేసావా అని  ఎద్దేవా చేశారు. ఆంతే కాకుండా టీడీపీ హయాంలో జరిగిన దుర్వినియోగానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్‌కు విచ్చేసిన సందర్భాల్లో సర్వ్‌ చేసే టీ స్నాక్స్‌ పేరిటే అన్ని లక్షలు ఎలా మింగారో అని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ ఖర్చులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు...


మరింత సమాచారం తెలుసుకోండి: