గత కొంతకాలంగా పాకిస్తాన్ అంతర్జాతీయం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.  ఈ సమస్యల కారణంగా పాక్ పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు.  పాక్ ఉగ్రవాదులను ఏరివేస్తామని చెప్పి... అంతర్జాతీయ దేశాల నుంచి డబ్బులు తీసుకొని, ఆ నిధులను ఉగ్రవాదుల అవసరాల కోసం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయంగా బ్లాక్ లిస్టులో పెట్టిన 130 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ లోనే ఉన్నారు.  బ్లాక్ లిస్ట్ లో ఉంచిన ఉగ్రవాద సంస్థలు పాక్ లోనే ఉన్నాయి.  


ఈ విషయం అందరికి తెలుసు.  వాటిని ఏరివేయాలని అంతర్జాతీయ దేశాలు ఒత్తిళ్లు తెస్తున్నాయి.  కానీ, పాక్ మాత్రం మారలేదు,  దాని తీరు ఒకేలా ఉన్నది.  ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూనే ఉన్నది.  ఇలా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ.. వారిని ఇండియాలోకి పంపి ఇండియాలో అలజడులు సృష్టించాలని చూస్తున్నది.  అంతేకాదు, ఎఫ్ఏటిఎఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా పాక్ ప్రవర్తిస్తుండటంతో.. పాక్ పై చర్యలు తీసుకోవడానికి ఆ సంస్థ సిద్ధం అయ్యింది.  


పాక్ కు 27 అంశాలతో కూడిన సిఫార్సులు ఇవ్వగా అందులో కేవలం 6 మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.  మిగతావి విరుద్ధంగా ఉండటంతో పాక్ ను డార్క్ గ్రే లిస్ట్ లో చేర్చేందుకు సిద్ధం అవుతున్నది.  పైగా ఎఫ్ఏటిఎఫ్ సభ్యదేశాలు ఒక్కటి కూడా పాక్ కు అనుకూలంగా మాట్లాడలేదు.  పాక్ ను డార్క్ గ్రే లిస్ట్ లో చేర్చే అంశంపై అక్టోబర్ 18 వ తేదీన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.  


ఈ నిర్ణయాన్ని అనుసరించి పాక్ భవితవ్యం ఉంటుంది.  ఒకవేళ పాక్ ను డార్క్ గ్రే లిస్టులో చేరిస్తే.. నిధులు ఆగిపోతాయి.  ఫలితంగా అక్కడ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది.  ఇప్పటికే ఆర్ధికంగా పాకిస్తాన్ వెనుకబడి ఉన్నది.  దీని నుంచి పాకిస్తాన్ బయటపడాలి అంటే తప్పకుండా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి.  దానికి అక్కడి ఆర్మీ, ఉగ్రవాదులు ససేమిరా అంటారు.  ఆర్మీని కాదని, ఉగ్రవాదులతో పేచీ పెట్టుకొని పాక్ రాజకీయాలు చేయలేదు.  అందుకే నోటికి వచ్చినట్టు ఇండియాపై అభాండాలు వేస్తోంది.  ఇండియానే ఎఫ్ఏటిఎఫ్ దేశాలపై ఒత్తిడి తెచ్చి.. పాక్ ను ఇబ్బందులో పెడుతుందని గగ్గోలు పెడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: