రాజు స్ధానంలో కూర్చున్న వ్యక్తికి కష్టాల్లో ఉన్న వారిని, అర్హులైన ప్రజలను ఆదుకునేందుకు గొప్ప మనసుండాలి. నాలుగు నెలల క్రితం సిఎం అయిన జగన్మోహన్ రెడ్డి తనకు అటువంటి మనసుందని చాటుకున్నారు.  హామీల అమలు విషయంలో చంద్రబాబునాయుడు హయాంలో ఏం జరిగిందో అందరూ చూసిందే.  ఇపుడు జగన్  హయాంలో ఏం  జరుగుతున్నదో అందరూ చూస్తున్నారు.

 

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా వాయిదా వేయాలా ? లబ్దిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలా ? అన్న విషయాల్లో చంద్రబాబు పనికిమాలిన లెక్కలు చాలానే వేసి దెబ్బతిన్నారు. అందుకనే జగన్ సిఎం అయిన దగ్గర నుండి పాదయాత్రలో కానీ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మ్యానిఫెస్టో అమలులో కానీ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

నిజానికి ఖజానాలో ఉన్నది ఖాళీ బొచ్చే అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొత్తం ఖజానాను పూర్తిగా నాకిపాడేశారు.  బహుశా జగన్ సిఎం అవుతారని చంద్రబాబుకు అర్ధమైపోయుంటుంది. అందుకనే ఖజానాను నాకేయటమే కాకుండా వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టేశారు. ఆ బిల్లులను చెల్లించటానికే జగన్ ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు.

 

ఇక జగన్ విషయాన్ని తీసుకుంటే తాజాగా రైతు భరోసా పథకంలో గతంలో ప్రకటించిన రూ. 12500 సాయాన్ని రూ. 13500కి పెంచారు. అలాగే లక్షల్లో గ్రామ, వార్డు, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లను భర్తీ చేశారు. హోంగార్డుల జీతాలను పెంచారు.  వైఎస్సార్ ఆసరా పథకంలో డ్వాక్రా మహిళల రూ. 27,168 కోట్ల రుణాలను తీర్చటానికి కసరత్తు ప్రారంభమైంది.

 

వైఎస్సార్ పెన్షన్ పథకంలో అదనంగా 7 లక్షల మందిని అర్హులను చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. అంగన్ వాడీ వర్కర్లతో పాటు ఆశా వర్కర్లకూ జీతాలను పెంచారు. స్కూల్ డ్రాపవుట్లను తగ్గించేందుకు అమ్మఒడి పథకాన్ని జనవరి 26 నుండి ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సీ ద్వారా కసరత్తు మొదలుపెట్టారు. అవినీతిని వీలున్నంతలో నియంత్రించటానికి అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.

 

రివర్స్ టెండర్ల తో  ప్రాజెక్టుల నిర్మాణాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మెయినటైన్ చేయటంలో భాగంగా పోలీసు విధుల్లో జోక్యం చేసుకోవటం లేదు. అధికార పార్టీ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయటమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద చంద్రబాబు అండ్ కో తప్ప మామూలు జనాలు హ్యాపీగానే ఉన్నారనే  చెప్పవచ్చు. పరిపాలన అంటే ఇలాగుండాలని చంద్రబాబు అండ్ కో కు  జగన్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: