తెలంగాణ విద్యార్థి వేదిక.. ఇదో స్టూడెంట్ యూనియన్.. అయితే ఇది మావోయిస్టుల విభాగంగా పనిచేస్తోందని తెలంగాణ పోలీసులు అంటున్నారు. ఈ తెలంగాణ విద్యార్థి వేదిక అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసి మావోయిస్టు పార్టీలో జాయిన్ చేస్తున్నారని ఇటీవల హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ తెలంగాణ విద్యార్థి వేదిక సీపీఐ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని అంటున్నారు.


ఇదే కారణంతో టీవీవీ నాయకులను అరెస్టు చేస్తోంది. దీన్ని నిషేధిత సంస్థగా ప్రకటించారు. టీవీవీ నాయకులు మద్దిలేటిపై, రాహుల్ పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే టీవీవీ నాయకుడు మద్దిలేటిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆ అరెస్టుకులు కొనసాగుతున్నాయి. ఈ తెలంగాణ విద్యార్థి వేదికతో పాటు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను కూడా నిషేధించిన పోలీసులు ఆ సంస్థ నాయకులను కూడా అరెస్టు చేస్తున్నారు.


తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాన కృష్ణను కూడా అరెస్టు చేశారు. ఈ వరుస అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల గద్వాల్ లో పోలీసుల తనిఖీలో మావోయిస్టులకు సంబంధించిన కొన్ని పుస్తకాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తనిఖీలో మావోయిస్టు నేత హరిభూషన్ కు రాసిన లెటర్ కూడా దొరికిందని చెప్పారు. వీరిపై నల్లకుంటపోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని.. దీనిపై ఏసీపీ ఆద్వర్యంలో సిట్ వేశామని పోలీసులు తెలిపారు.


విద్యార్థులు కూడా ఈ నిషేధిత ఆర్గనైజేషన్స్ పట్ల ఆకర్షితులు కావద్దని పోలీసులు కోరుతున్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘము, మహిళ విద్యార్థి సంఘము, తెలంగాణ విద్యార్థి సంఘం వంటి వాటిని బ్యాన్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకుల అరెస్టులను ప్రజాసంఘాల నాయకులు తప్పు బడుతున్నాయి. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: