జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటనను చూస్తే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. కెసియార్ కు వ్యతిరేకంగా పవన్ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయడని అందరికీ తెలిసిందే.  కెసియార్ ప్రభుత్వం జనాలకు వ్యతిరేకంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఇంతకాలం కనీసం ఒక్కసారి కూడా నోరెత్తి ప్రశ్నించిన పాపాన పోలేదు పవన్.

 

అలాంటిది ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతున్నట్లు పవన్ బహిరంగంగా చెప్పటమే విచిత్రంగా ఉంది. ఆర్టీసీ సమ్మె విషయంలో తన ఒంటెత్తు పోకడ వదులుకోవాలని పవన్ ఏకంగా కెసియార్ కు  సూచన కూడా చేసేశారు. 48 వేలమంది కార్మికులు, ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించటాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ సిబ్బందిని ఉద్దేశించి ’సెల్ఫ్ డిస్మిస్’ అంటూ   కెసియార్ ప్రకటన చేసిన తర్వాతే వారిలో అభద్రత మొదలైందని పవన్ అభిప్రాయపడ్డారు.

 

ఏదేమైనా వేలాదిమంది కార్మికులు, ఉద్యోగుల డిమాండ్ పరిష్కారం విషయంలో కెసియార్  పట్టుదలకు పోకుండా సామరస్యంగా చర్చలకు పిలవాలని పవన్ సూచించటమే ఆశ్చర్యంగా ఉంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కెసియార్ నిర్ణయాలను పవన్ తప్పు పడుతు మాట్లాడటమే అందరికి విడ్డూరంగా ఉంది.

 

ఒకపుడు ఇదే పవన్ తెలంగాణా సిఎం కెసియార్ ఇంటికెళ్ళి భోజనం చేసొచ్చారు. భోజనం బ్రహ్మాండమంటూనే కెసియార్ పాలన కూడా భేషుగా ఉందని కితాబునిచ్చిన విషయం అందరకీ గుర్తుంటే ఉంటుంది. కెసియార్ పాలనకు పవన్ కితాబిచ్చిన కాలంలో ఏపి అంటేనే తెలంగాణా ముఖ్యమంత్రి మండిపడేవారు.

 

తాను ఏపికి చెందిన వ్యక్తే అయినా ఏపి అంటే మండిపడిన కెసియార్ ను పొగడటానికి వెనకాడలేదు. సరే మొన్నటి ఎన్నికల్లో తనతో పాటు పార్టనర్ చంద్రబాబునాయుడుకు కూడా జనాలు గూబగుయ్యిమనిపించిన తర్వాత చాలా కాలం సైలెంట్ అయిపోయారు పవన్. మళ్ళీ ఇంత కాలానికి కెసియార్ కు వ్యతిరేకంగా పవన్ గొంతు విప్పటమంటే తెరవెనుక ఏదో వ్యూహం ఉన్నట్లే అమానంగా ఉంది. ఓ నాలుగు రోజులు ఆగితే అదేదో బయటపడకుండా ఉంటుందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: