ఆర్టీసీ సమ్మె పై కదిలిన ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ​​రోజు రోజుకి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు పెరుగుతుంది. మరో పక్క ఆత్మహత్య లకు పాల్పడుతున్న కార్మికులు సంఖ్యా కూడా క్రమేణా పెరుగుతూ వస్తుంది. మంగళవారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టున సమ్మె11 వ రోజుకు చేరుకుంది. పాలకుల అంచనాలకు భిన్నంగా సాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలతో ఎట్టకేలకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లో స్పందన కనిపిస్తుంది.  ఈ పరిణామాలను గమనిస్తున్న సర్కారు మేల్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే  ​ఆర్టీసీ జేఏసీ, వామపక్షాలతో కార్మిక సంఘాలతో "టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు చర్చలు జరిపే అవకాశం మెండుగా కానవస్తున్నాయి. ఫలితాలు సంగతి ఎలా ఉన్న ప్రభుత్వం నుంచి తోలి అడుగు పడుతుంది.



అది కూడా పదకొండు రోజుల తర్వాత అని చెప్పాలి. ఇదిలా ఉండగా   ​ఇప్పటికే మద్దతు ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి సంఘాలు, లాయర్స్ సంఘాలు, రెవెన్యూ సంఘాలు సర్కారుపై తమ ధ్వజమెత్తుతున్నారు. ​​బస్ లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ​తెలంగాణ ఆర్టీసీ జేఏసీ  పిలుపు మేరకు ముఖ్య మైన చౌరస్తాలలో మంగళవారం ఉ:9:00గం: నుండి 11;00గంటల వరకు ముఖ్య మైన చౌరస్తాలలో రాస్తారోకో కార్య క్రమాలను కొనసాగిస్తున్నారు.



ఈ రాస్తారోకో కార్యక్రమానికి  రాజకీయ,ట్రేడ్ యూనియన్, ఉద్యగ ఉపాద్యాయ సంఘాలను,కార్మిక కర్షక మరియు మహిళా సంఘాలను,విద్యార్థి సంఘాలతో పాటు, ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ సంఘాలు సైతం ఈ సమ్మెలో  పాలుపంచుకోనున్నారు.  టీఎస్ ఆర్టీసీ  సిబ్బందికి వేతనాలు ఇవ్వ కపోవడంతో  తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో హైకోర్టులో కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ మంగళవారం జరగనున్నది. మొత్తానికి ఆర్టీసీ సమ్మె కేస్ కోర్టు విచారణకు రానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: