సిరియాలో శాంతి పవనాలు వీస్తున్న సమయంలో అమెరికా సిరియా నుంచి తప్పుకుంది.  తమ బలగాలను వెనక్కి తీసుకుంది.  ఇలా అమెరికా తన బలగాలను ఎప్పుకైతే వెనక్కి తీసుకుందో ఆ వెంటనే టర్కీ .. సిరియాపై క్షిపణులతో దాడులు చేసింది.  అదే ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుర్దుల ప్రాంతంలో.  సిరియాలో ఐసిస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా కుర్దులు, సిరియా బలగాలు పోరాటం చేశాయి.  


వీరికి అమెరికా సైన్యం తోడుగా ఉంటూ ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేసింది.  వేలాది మంది ఉగ్రవాదులను సిరియా ప్రభుత్వం జైల్లో పెట్టింది.  అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్న సమయంలో టర్కీ క్షిపణుల దాడి చేయడంతో అక్కడి సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు.  సిరియా జైలులో ఉన్న ఐసిస్ తీవ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు.  


దీనిని యూరప్ దేశాలు ఖండించాయి.  అయితే, యూరప్ సిరియాకు సపోర్ట్ చేస్తే.. తమ దగ్గర శరణార్థులుగా ఉన్న 35 మిలియన్ మంది సిరియా వాసులను యూరప్ దేశంలోకి పంపుతామని చెప్పి భయపెట్టింది.  బ్లాక్ మెయిల్ చేసింది.  టర్కీ దాడుల్లో సామాన్య ప్రజలు బలికావడంతో..టర్కీపై అమెరికా సీరియస్ అయ్యింది.  టర్కీపై ఆంక్షలు విధించింది.  టర్కీ స్టీల్ పై భారీ సుంకాలు విధించింది.  టర్కీతో ఉన్న 100 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని రద్దు చేసుకుంది.  


టర్కీపై అదనపు ఆంక్షలు కూడా విధిస్తున్నట్టు అమెరికా పేర్కొన్నది. ఇప్పటికైనా టర్కీ దాడులకు స్వస్తి పలకాలని, లేదంటే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. అయితే, టర్కీ మాత్రం ఈ విషయంపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు.  సిరియాపై దాడి చేసి తీరుతామని అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. సిరియాపై దాడి చేసి ఐసిస్ ఉగ్రవాదులను జైలు నుంచి తప్పిస్తే.. దానివలన టర్కీకి ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంటుంది.  ఐసిస్ తీవ్రవాదులు టర్కీ మద్దతు ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.  గల్ఫ్ లో ఇది మరో ఆధిపత్య పోరుకు దారితీసేలా కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: