దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి . అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టినప్పటికే  విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రభుత్వం ఇవ్వడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయి . అయితే ప్రభుత్వం విద్యా సంస్థలకు కేటాయించిన దసరా సెలవులు ముగిసినప్పటికీ... ఆర్టీసీ సమ్మె మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థల దసరా సెలవులు విషయంలో పునరాలోచన ప్రభుత్వం... దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగించింది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు ఈనెల 19 వరకు దసరా సెలవులు కేటాయించాలని తెలిపింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అటు తల్లిదండ్రులు ప్రజలు పెదవి విరుస్తున్నారు. 

 

 

 

 

 

 ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని అంటున్నారు . ఇలాంటి  నిర్ణయం వల్ల విద్యార్థుల చదువు పాడవుతుందని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె పై సరైన పరిష్కారం చూపకుండా ఇలా విద్యాసంస్థల సెలవులు పొడిగించుకుంటూ పోతే... విద్యార్థుల భవిష్యత్తు ఏమి కావాలి అని ప్రశ్నిస్తున్నారు. విద్యాసంస్థలకు ప్రభుత్వం బంద్  ప్రకటించడంతో వాళ్ళ సిలబస్ ఎలా పూర్తవుతుందని... విద్యార్థులు ఎలా చదువుకుంటారని  విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని విద్యా సంస్థలను పునః  ప్రారంభించారని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం విద్యా సంస్థల దసరా సెలవులను పొడగిస్తూ తీసుకున్న నిర్ణయంపై... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

 

 

 

 

 విద్యాసంస్థల కు ఈ నెల 19 వరకు ప్రభుత్భం  బంద్  ప్రకటించడంతో విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని సిలబస్ కూడా వెనకబడి పోతుందని  ఆరోపిస్తూ... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై  హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం 3:45 గంటలకు  విచారణ జరపనుంది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ తో ప్రభుత్వం విద్యా సంస్థల బంద్ చేపట్టడంపై ప్రజలందరు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని హైకోర్టులో పిటిషన్ లో పేర్కొన్నారు పిటిషన్ దారులు . అయితే ఈ పిటిషన్ పై  నేడు విచారణ జరుపనున్న  హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: