తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉధృతంగా నడుస్తోంది. సమ్మె మొదలై 11 రోజులు గడుస్తున్నా కార్మికులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మీ ఉద్యోగాలు పీకేశాం అన్నా బెదరడం లేదు. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు ఇతర వర్గాలు కూడా మద్దతిస్తున్నాయి. సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. అదే సమయంలో సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.


ఈ నేపథ్యంలో అసలు ఆర్టీసీ సమ్మెను నడిపిస్తోంది కొందరు టీఆర్ ఎస్ నాయకులే అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తున్నది మా పార్టీ నాయకులే అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెను రెచ్చగొడుతున్నది తమ పార్టీ నాయకులే అంటున్నారాయన.


ఇంతకీ ఆర్టీసీ నాయకులను వెనక ఉండి ప్రోత్సహిస్తున్నది ఎవరు.. తెరవెనుక కథ నడిపిస్తోంది ఎవరు.. ఈ నాయకుల వెనుక తెలంగాణ ఆర్టీసీ సమ్మె వెనుక టీఆర్ ఎస్ నాయకుల పాత్ర ఉందా.. ఉంటే వారు ఎవరు.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వీటికి సమాధానం తనకు తెలుసంటున్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.


అయితే ఈ విషయాలు మాత్రం తాను మీడియాతో పంచుకోనని.. నేరుగా ముఖ్యమంత్రి దృష్టికే తీసుకు వెళ్తానని ముత్తిరెడ్డి అంటున్నారు. ఈయన వ్యాఖ్యలతో ఒక్క విషయం మాత్రం క్లియర్ అయ్యింది. ఆర్టీసీ సమ్మెపై సర్కారు వైఖరిని సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు.


అయితే ఆ వ్యతిరేకత ఆర్టీసీ సమ్మె వరకే పరిమితమా లేక.. దీని వెనుక ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఏమైనా ఉందా అన్నది ముందు ముందు కానీ తెలియదు. అంటే ఆర్టీసీ సమ్మె అటు ప్రజలనే కాకుండా ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేస్తుందన్నమాట. టీఆర్ఎస్ పార్టీలోని లుకలుకలను వెలుగులోకి తెస్తుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: