హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది.  అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.  అయితే, ప్రధానంగా కాంగ్రెస్, తెరాస పార్టీల మధ్యన పోటీ ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  రెండు పార్టీలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి.  మొన్నటి వరకు హుజూర్ నగర్లో మద్దతు ఇస్తామని చెప్పిన సిపిఐ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంది.  ఇది తెరాస పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని చెప్పాలి.  


ఎందుకంటే, సిపిఐ పార్టీకి కొంతమేర ఓటు బ్యాంకు ఉన్నది. సిపిఐ తెరాస పార్టీకి మద్దతు ఇస్తే.. సిపిఐ సానుభూతి పరులు తెరాస కు ఓటు వేస్తారు.  అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అవుతుంది.  కానీ, ఇప్పుడు తెరాస పార్టీకి మద్దతు ఇవ్వను అని స్పష్టంగా చెప్పడంతో.. తెరాస పార్టీకి గట్టి దెబ్బ పడే అవకాశం ఉన్నది.  ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నది.  ఇప్పటికే పార్టీ నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నది.  


మరోవైపు కార్మికులు కూడా తెరాస కు వ్యతిరేకంగా ఉండటం తెరాస కు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.  తెరాస మాత్రం విజమం తమదే అని స్పష్టం చేస్తున్నారు.  ధీమా చెప్తున్నారు.  ఎవరు ఎన్నిరకాల ఎత్తులు వేసినా.. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన అంతిమంగా ప్రజలు తమ పక్షానే నిలుస్తారని, ప్రజలు తమకే సపోర్ట్ చేస్తారని, ప్రజాయోగ్యమైన పధకాలు కెసిఆర్ తీసుకొచ్చారని నాయకులు అంటున్నారు.  


దీనికి ముందు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచుతూ తెరాస పార్టీ నిర్ణయం తీసుకోవడంతో.. పారిశుద్ధ్య కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  పారిశుద్ధ్య కార్మికులకు దీపావళిని ముందుగానే తీసుకొచ్చింది. అయితే, ఆర్టీసీ కార్మికుల విషయంలో మాత్రం పార్టీ కఠినంగా వ్యవహరిస్తోంది.  ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్తున్నది.  అయితే, ఆర్టీసీ కార్మికులు ఇద్దరు ఆత్మత్యాగం చేసుకోవడంతో ప్రభుత్వం ఓ అడుగు దిగివచ్చి చర్చలు జరుపుతాం అని చెప్తున్నది.  మరి చూడాలి  ఏమౌతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: